Telugu Global
Cinema & Entertainment

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి కి..... ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు !

దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమ లో పేరున్న నిర్మాతల్లో ఒకరు. ఆయన ప్రస్తుతం మహర్షి నిర్మాణ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు. ఈ సంవత్సరం మొదట్లోనే F2 చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బాస్టర్ కొట్టడమే కాకుండా…. భారీ లాభాలనే వెనకేసుకున్నాడు. అనిల్ రావిపూడి తో దిల్ రాజు నిర్మించిన మూడో చిత్రం ఇది. త్వరలోనే నాలుగో చిత్రానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే తాజా ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు దిల్ రాజు తనతో పని […]

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి కి..... ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు !
X

దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమ లో పేరున్న నిర్మాతల్లో ఒకరు. ఆయన ప్రస్తుతం మహర్షి నిర్మాణ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు.

ఈ సంవత్సరం మొదట్లోనే F2 చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బాస్టర్ కొట్టడమే కాకుండా…. భారీ లాభాలనే వెనకేసుకున్నాడు. అనిల్ రావిపూడి తో దిల్ రాజు నిర్మించిన మూడో చిత్రం ఇది. త్వరలోనే నాలుగో చిత్రానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.

అయితే తాజా ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు దిల్ రాజు తనతో పని చేసిన, తనకి పెద్ద హిట్ ఇచ్చిన ఒక దర్శకుడికి ఖరీదైన కారు ని గిఫ్ట్ గా ఇచ్చాడట. అందరూ ఆ దర్శకుడు అనిల్ రావిపూడి అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ దర్శకుడు వేణు శ్రీరామ్.

వేణు శ్రీరామ్ తో ఒకప్పుడు దిల్ రాజు ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాని తీశాడు. చాలా ఏళ్ళ తర్వాత నాని తో ‘MCA’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. వెనువెంటనే ఈ దర్శక నిర్మాతలు మరో చిత్రానికి చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవలే వేణు అల్లు అర్జున్ కి ఒక కథ సిద్ధం చేసి వినిపించాడని చెబుతున్నారు. త్వరలోనే దిల్ రాజు ఈ సినిమా ని సెట్స్ పైకి తీసుకెళదామని అనుకుంటున్నాడట. అలా హిట్ కొట్టాక కూడా ఇంకో నిర్మాత దగ్గరకి వెళ్లకుండా వేణు తన బ్యానర్ లో నే తదుపరి చిత్రం చేద్దాం అనుకుంటున్నందున దిల్ రాజు ప్రత్యేకం గా ఈ డైరెక్టర్ కి హ్యుండయ్ కంపెనీకి చెందిన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు.

First Published:  5 April 2019 2:55 AM GMT
Next Story