Telugu Global
NEWS

వైసీపీ అభ్యర్థిని కొట్టిన చింతమనేని

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి ఏకంగా తనపై పోటీ చేస్తున్న అభ్యర్థిపైనే చేయి చేసుకున్నాడు. వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఈఘటన జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు చింతమనేని, టీడీపీ నేతలు ప్రయత్నించడంతో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి అభ్యంతరం తెలిపారు. దాంతో చింతమనేనిలోని రౌడీ బయటకు వచ్చాడు. అబ్బయ్య చౌదరిని నోటికొచ్చినట్టు తిడుతూ చేయి చేసుకున్నాడు. పోలీసుల సమక్షంలోనే చింతమనేని ఈ దాడి చేశాడు. అనంతరం అబ్బయ్య చౌదరిని చింతమనేని ప్రభాకర్‌ పక్కకు తోసేశాడు. వైసీపీ నాయకులను నోటికొచ్చినట్టు తిట్టాడు […]

వైసీపీ అభ్యర్థిని కొట్టిన చింతమనేని
X

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి ఏకంగా తనపై పోటీ చేస్తున్న అభ్యర్థిపైనే చేయి చేసుకున్నాడు. వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఈఘటన జరిగింది.

పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు చింతమనేని, టీడీపీ నేతలు ప్రయత్నించడంతో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి అభ్యంతరం తెలిపారు. దాంతో చింతమనేనిలోని రౌడీ బయటకు వచ్చాడు.

అబ్బయ్య చౌదరిని నోటికొచ్చినట్టు తిడుతూ చేయి చేసుకున్నాడు. పోలీసుల సమక్షంలోనే చింతమనేని ఈ దాడి చేశాడు.

అనంతరం అబ్బయ్య చౌదరిని చింతమనేని ప్రభాకర్‌ పక్కకు తోసేశాడు. వైసీపీ నాయకులను నోటికొచ్చినట్టు తిట్టాడు చింతమనేని.

First Published:  5 April 2019 9:40 AM GMT
Next Story