Telugu Global
NEWS

సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే గడువు..!

ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేదెవరో… ఓడేదెవరో…. అధికార పీఠంపై కూర్చునేదెవరో… ప్రతిపక్షంలో నిలబడేది ఎవరో… మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. సమయం లేదు మిత్రమా…. అంటూ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇక ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇందులో కూడా మూడు రోజులు మాత్రమే ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు రోజులూ ప్రచారం చేసేందుకు ఎవ్వరికీ అవకాశం ఉండదు. దీంతో ఈ ఐదు రోజులు ఎన్నికల బరిలో నిలిచిన వారందరికీ పెద్ద పరీక్ష కానుంది. ఆంధ్రప్రదేశ్ […]

సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే గడువు..!
X

ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేదెవరో… ఓడేదెవరో…. అధికార పీఠంపై కూర్చునేదెవరో… ప్రతిపక్షంలో నిలబడేది ఎవరో… మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

సమయం లేదు మిత్రమా…. అంటూ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఇక ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇందులో కూడా మూడు రోజులు మాత్రమే ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు రోజులూ ప్రచారం చేసేందుకు ఎవ్వరికీ అవకాశం ఉండదు.

దీంతో ఈ ఐదు రోజులు ఎన్నికల బరిలో నిలిచిన వారందరికీ పెద్ద పరీక్ష కానుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభలకు, తెలంగాణలో లోక్ సభకు ఎన్నికలు గతంలో లాగా కాకుండా ఒకేసారి నిర్వహించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ సారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ ఎన్నికలతోనే రాజకీయ పార్టీగా అవతరించిన పవన్ కళ్యాణ్ తన వంతుగా ఎన్ని ఓట్లు చీలుస్తారోనని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఈ పార్టీలకు తోడు…. గెలిచినా… గెలవకపోయినా అన్ని స్థానాల నుంచి బరిలోకి దిగుతోంది కే. ఏ. పాల్ రాజకీయ పార్టీ ప్రజా శాంతి.

ఎన్నికల ఖర్చు విషయానికి వస్తే ఒక్కో అభ్యర్థి కనీసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు.

పారిశ్రామిక వేత్తలు పోటీ పడుతున్న స్థానాలలో అయితే నిధుల ఖర్చు 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు.

ఐదు రోజులలో ఓటరు తన తీర్పు చెప్పడానికి, రానున్న ఐదు సంవత్సరాలలో తమను పాలించే వారిని ఎన్నిక చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

First Published:  5 April 2019 10:06 PM GMT
Next Story