Telugu Global
Cinema & Entertainment

'ఆర్ఆర్ఆర్' నుండి తప్పుకున్న.... ఎన్టీఆర్ హీరోయిన్

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన అప్పటినుంచి ఆ చిత్రం గురించి బోలెడు పుకార్లు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ద్వారా చాలావరకు చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా మొత్తం ప్రీఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా దర్శనమిస్తాడని తెలిసిందే. అంతేకాక ఈ సినిమాలో నటించే […]

ఆర్ఆర్ఆర్ నుండి తప్పుకున్న.... ఎన్టీఆర్ హీరోయిన్
X

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని అనౌన్స్ చేసిన అప్పటినుంచి ఆ చిత్రం గురించి బోలెడు పుకార్లు బయటికి వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ ద్వారా చాలావరకు చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా మొత్తం ప్రీఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా దర్శనమిస్తాడని తెలిసిందే.

అంతేకాక ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి, రామ్ చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తుండగా ఎన్టీఆర్ తో హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ రొమాన్స్ చేయనుంది అని తెలియజేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ చిత్రం నుంచి ఆమె బయటకు వచ్చేసింది అని తెలుస్తోంది.

ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది డైసీ. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ సినిమాలో నటించలేక పోతున్నానని, స్క్రిప్ట్ చాలా బాగుందని… అలానే తన పాత్ర కూడా చాలా మంచిదని చెప్పుకొచ్చింది డైసీ.

ఈమె చేయవలసిన పాత్ర కోసం ఎవరినైతే ఎంచుకుంటారో వారికి కూడా మంచి ఆదరణ లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ లో తెలియజేశారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ, ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

First Published:  5 April 2019 9:04 PM GMT
Next Story