భారత ఫుట్ బాల్ సంఘానికి అరుదైన గౌరవం

  • ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య మండలి సభ్యుడిగా ప్రఫుల్ పటేల్
  • పీఫా కౌన్సిల్ లో చోటు సంపాందించిన తొలి భారతీయుడు ప్రఫుల్ పటేల్
  • 46కు 38 ఓట్లతో నెగ్గిన ప్రఫుల్ పటేల్

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో…భారత్ కు ఓ  అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య మండలిలో ఓ భారతీయుడు తొలిసారిగా చోటు సంపాదించాడు.

మలేసియాలోని కౌలాలంపూర్ లో ముగిసిన పిఫా ఆసియా మండలి ఎన్నికల్లో…భారత ఫుట్ బాల్ సంఘం అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తిరుగులేని విజయం సాధించారు.

 మొత్తం ఐదుస్థానాల కోసం ఎనిమిదిమంది మధ్య జరిగిన ఓటింగ్ లో ప్రఫుల్ పటేల్ …46 ఓట్లకు 38 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. పిఫా కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన ప్రఫుల్ పటేల్ ను పిఫా అధ్యక్షుడు అభినందించారు.

ఇప్పటికే ప్రపంచ అండర్ -17 యువజన ఫుట్ బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా…భారత ఫుట్ బాల్ సంఘం తన సత్తాను చాటుకొంది.

అంతేకాదు.. ప్రపంచ మహిళల యువజన ఫుట్ బాల్ పోటీలు నిర్వహించే అరుదైన అవకాశాన్ని సైతం సొంతం చేసుకొంది.