Telugu Global
Cinema & Entertainment

సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు.... టీజర్ రివ్యూ

గంటల్లో వైరల్ అయిన డైలాగ్ ఇది. మహర్షి టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ”సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి” అని మహేష్ చెప్పిన ఈ డైలాగ్ టోటల్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఉగాది కానుకగా ఈరోజు మహర్షి టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ పై ఎక్స్ క్లూజివ్ రివ్యూ మహేష్ బాబు సినిమాల్లో క్లాస్, మాస్ రెండూ మిక్స్ అయి ఉంటాయి. […]

సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు.... టీజర్ రివ్యూ
X

గంటల్లో వైరల్ అయిన డైలాగ్ ఇది. మహర్షి టీజర్ లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ”సక్సెస్ కు ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి” అని మహేష్ చెప్పిన ఈ డైలాగ్ టోటల్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఉగాది కానుకగా ఈరోజు మహర్షి టీజర్ ను విడుదల చేశారు.

ఆ టీజర్ పై ఎక్స్ క్లూజివ్ రివ్యూ

మహేష్ బాబు సినిమాల్లో క్లాస్, మాస్ రెండూ మిక్స్ అయి ఉంటాయి. మహర్షి మాత్రం ఓన్లీ క్లాస్ మూవీ అనుకున్నారంతా. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ టీజర్ లోనే క్లారిటీ ఇచ్చింది యూనిట్. హెలికాప్టర్ నుంచి మహేష్ దిగే క్లాస్ లుక్ ను చూపిస్తూనే, రౌడీల్ని చితక్కొట్టే మాస్ లుక్ లో కూడా ప్రజెంట్ చేశారు. అంతేకాదు.. ‘నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌.. ఎవరైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే… గెలిచి చూపించడం నాకు అలవాటు’ అనే మాస్ డైలాగ్ ను కూడా టీజర్ లోనే చూపించారు.

మొత్తమ్మీద టీజర్ తో మహర్షి పై ఇప్పటికే ఉన్న భారీ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ బాకీ ఉంది. వచ్చే వారం నుంచి జరగనున్న ఆ షెడ్యూల్ లో ఓ పాటను పిక్చరైజ్ చేయబోతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే 9న వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు.

First Published:  6 April 2019 5:44 AM GMT
Next Story