Telugu Global
NEWS

నేరస్తులకు క్లీన్ చిట్ " బాబు స్టైల్

అధికారం అండగా ఉందన్న అహంభావంతో, తామేం చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో తెలుగుదేశం నేతలు జనంపై దాడులు, దమనకాండ సాగిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఏకంగా తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థిపైనే చేయిచేసుకున్నాడు. టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడటాన్ని జనం తీవ్రంగా ఏవగించుకుంటున్నారు. పదేపదే దాడులకు పాల్పడిన పార్టీ నేతలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం వారికి క్లీన్ చిట్ ఇవ్వడంవల్లే ఇలాంటి […]

నేరస్తులకు క్లీన్ చిట్  బాబు స్టైల్
X

అధికారం అండగా ఉందన్న అహంభావంతో, తామేం చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో తెలుగుదేశం నేతలు జనంపై దాడులు, దమనకాండ సాగిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఏకంగా తన ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థిపైనే చేయిచేసుకున్నాడు.

టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడటాన్ని జనం తీవ్రంగా ఏవగించుకుంటున్నారు. పదేపదే దాడులకు పాల్పడిన పార్టీ నేతలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం వారికి క్లీన్ చిట్ ఇవ్వడంవల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అంటున్నారు.

అనేక అక్రమాలకు పాల్పడి, ఏకంగా 36కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ తన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై చేయి చేసుకోవడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా గర్హిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొనే ఉద్యోగులను ప్రలోభపెట్టరాదని ఆక్షేపించిన వైెఎస్సార్సీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరిపై చింతమనేని రౌడీలా విరుచుకుపడ్డారు.

నోటికివచ్చినట్టు దుర్భాషలాడటంతో పాటు, పోలీసుల ముందే…. అబ్బయ్య చౌదరిపై చేయిచేసుకోవడం టీడీపీ నేతల అహంభావాన్ని, చట్టం అంటే వారికున్న చులకన భావాన్నితెలియజేస్తోంది. వివిధ నేరారోపణలతో టీడీపీ నేతలపై గతంలో ఫిర్యాదులు వచ్చినపుడు వారిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుండటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

అనుచిత ప్రవర్తన, అభిమానులపై దాడి, దుర్భాషలాడటం తదితర కారణాలతో గతంలో పలుసార్లు వార్తలకెక్కిన ముఖ్యమంత్రి బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తాజాగా తన ఎన్నికల ప్రచారంలో దేశ ప్రధాని నరేంద్రమోదీపై నోరుపారేసుకున్నారు.

ఎవడూ తనను ఏం పీకలేడని బాలకృష్ణ తన ప్రసంగంలో అన్నారు. మోడీ పీకలేడు. జగన్ పీకలేడు. కేసీఆర్ పీకలేడు. ఎవ్వడూ పీకలేడు. మోదీని ఇప్పటికే బాగా తిట్టాను. మోదీ మగాడైతే వెళ్లి సముద్రంలో పడిచావాలి. అంటూ అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేశారు. మొన్నటికిమొన్న మీడియా ప్రతినిధిని కూడా ఆయన దుర్భాషలాడారు.

అత్యాచార యత్నం, కిడ్నాప్, అనుచిత, అసభ్య ప్రవర్తన అభియోగాలతో తమపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై గతంలో పలుసార్లు ఆరోపణలు వచ్చినా వాటిపై చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోకపోవడంతో… వారికి చట్టంపై ఏ మాత్రం గౌరవంలేకుండా పోయిందని వారంటున్నారు.

తీవ్రమైన అభియోగాలతో 21మందిపై నమోదైన కేసుల విచారణను ఉపసంహరించాలని చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల డి.జి.పి.ని ఆదేశించడం, ఇందుకోసం రాష్ట్ర హోమ్ మంత్రిత్వశాఖ ఏకంగా 22 జీవోలు జారీచేయడం వారి నేర ప్రవృత్తిని మరింతగా ప్రోత్సహించడమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇలా కేసులనుంచి విముక్తి పొందిన వారిలో సినీ నటుడు ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వర రావు కూడా ఉన్నారు.

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిపైనా కనీస చర్యలు తీసుకోకపోవడం, వారిపై కేసులను కూడా ఉపసంహరించుకోవడంతో వాళ్ళ విశృంఖలత్వానికి అడ్డూ అదుపులేకుండా పోతోందని జనం అభిప్రాయపడుతున్నారు.

First Published:  6 April 2019 7:03 AM GMT
Next Story