Telugu Global
Cinema & Entertainment

బుల్లితెరపై... నిహారిక

‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయమైన నిహారిక కొణిదెల… నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో కనిపించిన ఈమె… ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాలో నటించింది. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ మధ్యనే విడుదలైన ‘సూర్యకాంతం’ సినిమా కూడా ఓ మోస్తరుగా నడుస్తోంది. నిహారిక తదుపరి […]

బుల్లితెరపై... నిహారిక
X

‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయమైన నిహారిక కొణిదెల… నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్ లో కనిపించిన ఈమె… ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాలో నటించింది. తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇక ఈ మధ్యనే విడుదలైన ‘సూర్యకాంతం’ సినిమా కూడా ఓ మోస్తరుగా నడుస్తోంది. నిహారిక తదుపరి ప్రాజెక్టు ఎలా ఉండబోతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఇప్పటిదాకా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిహారిక కొణిదెల ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించనుంది.

తాజా సమాచారం ప్రకారం నిహారిక కొన్ని రియాలిటీ షో లు మరియు టాక్ షో లు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల తర్వాత నిహారిక ఈ టీవీ షోల పై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఢీ జూనియర్స్1, ఢీ జూనియర్స్ 2 షోలకు హోస్ట్ గా వ్యవహరించింది నిహారిక. ఇప్పుడు మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను పలకరించనుంది.

First Published:  6 April 2019 5:20 AM GMT
Next Story