Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడు ఫస్ట్ లుక్ విడుదల

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాక్షసుడు`. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. త‌మిళంలో హిట్ అయిన రాట్సస‌న్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరిట రీమేక్ చేస్తున్నారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. బెల్లంకొండ […]

రాక్షసుడు ఫస్ట్ లుక్ విడుదల
X

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'రాక్షసుడు'. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

త‌మిళంలో హిట్ అయిన రాట్సస‌న్ చిత్రాన్ని తెలుగులో రాక్షసుడు పేరిట రీమేక్ చేస్తున్నారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అతడి సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ.

ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు 60 శాతం పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా షూటింగ్ ను పూర్తిచేసి రంజాన్ కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  6 April 2019 5:30 AM GMT
Next Story