Telugu Global
Health & Life Style

ఖనిజాల వనం.... సగ్గుబియ్యం....

సగ్గుబియ్యం. పాయసం గుర్తుకొస్తోంది కదూ…! పండగ పూట నోరూరుతోంది కదా… సగ్గుబియ్యం రుచికే కాదు…. ఆరోగ్యానికి కూడా ఆయువుపట్టు వంటిది. ఇంతకీ ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయి… ఎక్కడ నుంచి వస్తాయి… వాటి వల్ల లాభాలు ఏంటీ అన్నది చాలా మందికి తెలియదు. ఇవి కూడా వరి, గోధుమ లాగే సాగు చేస్తారని అనుకుంటారు. కాని ఇది పరిశ్రమలోనే తయారవుతుందని చాలా మందికి తెలియదు. దీని తయారికి కర్ర పెండలమే (tapioca) ముడిసరుకు. సుమారు 500 కిలోల […]

ఖనిజాల వనం.... సగ్గుబియ్యం....
X

సగ్గుబియ్యం. పాయసం గుర్తుకొస్తోంది కదూ…! పండగ పూట నోరూరుతోంది కదా… సగ్గుబియ్యం రుచికే కాదు…. ఆరోగ్యానికి కూడా ఆయువుపట్టు వంటిది. ఇంతకీ ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయి… ఎక్కడ నుంచి వస్తాయి… వాటి వల్ల లాభాలు ఏంటీ అన్నది చాలా మందికి తెలియదు.

ఇవి కూడా వరి, గోధుమ లాగే సాగు చేస్తారని అనుకుంటారు. కాని ఇది పరిశ్రమలోనే తయారవుతుందని చాలా మందికి తెలియదు. దీని తయారికి కర్ర పెండలమే (tapioca) ముడిసరుకు.

సుమారు 500 కిలోల కర్రపెండలాలతో కేవలం 100 కిలోల సగ్గుబియ్యం తయారవుతాయి. మనదేశంలో కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలలో మాత్రమే సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు.

  • సగ్గుబియ్యంలో కాల్షియం శాతం ఎక్కువ కాబట్టి ఇవి ఎముకలకు, కండరాలకు ఎంతో బలాన్ని ఇస్తాయి.
  • సగ్గుబియ్యంలో ఉండే పొటాషియం బీపీని అదుపు చేయడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా సాగేందుకు తోడ్పడుతుంది.
  • సగ్గుబియ్యం పిండి పదార్దం. అంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
  • వీటిని పరిశ్రమలలో ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేస్తారు. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకున్నా నష్టం ఉండదు.
  • శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించడంలో సగ్గుబియ్యం సాయపడతాయి.
  • సగ్గుబియ్యం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి కడుపులో ఉన్న పాపాయి బలంగా ఎదగడానికి ఎంతో సాయపడుతుంది.
  • అల్జీమర్స్ వ్యాధికి సగ్గుబియ్యం ఓ అద్భుత ఔషధం. వీటిలో విటమిన్ కె అల్జీమర్స్ ని అదుపు చేస్తుంది.
  • విరోచనాలు, జ్వరం తర్వాత వచ్చే నీరసం తగ్గాలంటే సగ్గుబియ్యం జావ తాగితే ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది.
  • సగ్గుబియ్యం జావకు నీళ్ల విరోచనాలను అరికట్టే గుణం ఉంది.
  • కండరాలు గట్టి పడడానికి సగ్గుబియ్యం ఎంతో సాయపడతాయి.
First Published:  5 April 2019 9:36 PM GMT
Next Story