ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు పెడుతున్నా…

ఎవరో మాట్లాడిన ఆడియో టేపును విజయసాయిరెడ్డి ఆడియోగా తప్పుడు ప్రసారం చేస్తున్న ఏబీఎన్ చానల్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి పైర్ అయ్యారు. ఆంధ్రజ్యోతి కుల జ్యోతి మాత్రమేనని… ఒక కులానికి కొమ్ము కాస్తున్న
పత్రిక మాత్రమేనన్నారు. చంద్రబాబుతో పాటు ఏబీఎన్ రాధాకృష్ణ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని… అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకప్పుడు మంద కృష్ణ మాదిగను బాడుగ నేత అన్నాడు…. నిజానికి చంద్రబాబుకు, టీడీపీకి బాడుగ నేత రాధాకృష్ణే…. ఎన్నికల సందర్భంగా ఏబీఎన్ రాధాకృష్ణ ప్రజలను కన్ ఫ్యూజ్ చేయలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ఆడియో నాది కాదని ఆ వాయిస్ విన్న ప్రజలందరికీ తెలుసు. రాధా కృష్ణకు కులపిచ్చి తప్ప… ఏ విలువలూ లేవు.

రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టే అయితే తన పేరుతో ప్రసారం చేసిన ఆడియోను నిరూపించాలని సవాల్ చేశారు. అసలు ఆ వాయిస్ తనది కాదన్న విషయం అందరికీ తెలుసన్నారు. కానీ తెలియని అమాయకులను నమ్మించేందుకు రాధాకృష్ణ దిగజారి ఈ పని చేస్తున్నారన్నారు. నిన్న లక్ష్మీపార్వతి పైనా ఇదే తరహాలోనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. దీన్ని బట్టే రాధాకృష్ణ వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చన్నారు.

సమాజానికి రాధాకృష్ణ ఒక చీడపురుగు అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. కిరోసిన్ దొంగతనం, బియ్యం దొంగతనంతో మొదలైన రాధాకృష్ణ కూడా మీడియా నడుపుతూ నీతులు చెబుతున్నాడన్నారు.  ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం నుంచి ఏబీఎన్ సంస్థలకు 1500 కోట్లు అధికారికంగా చేరిందన్నారు. ఏపీ ప్రజలను చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ దోచుకు తిన్న పత్రి పైసాను తిరిగి వసూలు చేస్తామన్నారు.

జర్నలిస్టు విలువలను వదిలేసి తప్పుడు ప్రచారం చేస్తున్న ఏబీఎన్‌ను మూసేయాలని బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాధాకృష్ణ, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ గెలుపును ఆపలేరన్నారు. తన పేరుతో తప్పుడు ఆడియోను ప్రసారం చేసిన రాధాకృష్ణపై కేసు పెడుతున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.