Telugu Global
Cinema & Entertainment

అల్లు కాంపౌండ్ నుంచి.... మరొక హీరో

ఇప్పటికే అల్లు అరవింద్ కుటుంబం నుండి అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీ లో హీరోలుగా అడుగు పెట్టారు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా తెలుగులోనే కాకుండా కేరళ తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించాడు. ఇప్పుడు అల్లు అరవింద్ బంధుమైన విరాన్ ముత్తంశెట్టి కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిట్టిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో హీరోగా […]

అల్లు కాంపౌండ్ నుంచి.... మరొక హీరో
X

ఇప్పటికే అల్లు అరవింద్ కుటుంబం నుండి అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇండస్ట్రీ లో హీరోలుగా అడుగు పెట్టారు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా తెలుగులోనే కాకుండా కేరళ తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించాడు. ఇప్పుడు అల్లు అరవింద్ బంధుమైన విరాన్ ముత్తంశెట్టి కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు.

పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిట్టిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో హీరోగా తెలుగు తెరపై కనిపించనున్నాడు విరాన్.

చిత్రం గురించి మాట్లాడుతూ, “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు ఏదో ఒక అవతారం ఎత్తుతాడు. కానీ ధర్మం నశించి, ఆ దేవుడి ఉనికే ప్రశ్నగా మారినప్పుడు తిరిగి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసే ఓ యువకుడి కథే ఈ సినిమా” అని దర్శకుడు అన్నారు.

నిర్మాత సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి మాట్లాడుతూ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు, డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుంచి మొదలవుతుందని తెలిపారు.

తిరుపతి, పశ్చిమ గోదావరి, రంపచోడవరం, కేరళ, తమిళనాడు ప్రాంతాలలో షూటింగ్ జరుగనుంది. ఉగాది నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతాయని కూడా దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం జీబు అందిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చిట్టిశర్మ చూసుకోనున్నారు.

First Published:  5 April 2019 9:28 PM GMT
Next Story