తొక్క తీస్తా… ఈడ్చీపారేస్తా … రేయ్‌ – దళితులపై ఎమ్మెల్యే దౌర్జన్యం

ప్రజాసమస్యలపై నిలదీసిన దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి నోరు పారేసుకున్నారు. తొక్క తీస్తా అంటూ దూషించారు.

ప్రచారానికి వచ్చిన బడేటిని పోణంగి గ్రామానికి చెందిన దళితులు.. ఐదేళ్లలో తమకు ఏం చేశారని నిలదీశారు. తనను దళితులు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే ఊగిపోయారు. నన్నే ప్రశ్నిస్తారా?, తొక్క తీస్తా.. ఈడ్చి పారేస్తా…. రేయ్‌…. అంటూ తిట్లదండకం అందుకున్నారు.

ఎమ్మెల్యేను చూసుకుని టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రచారానికి వెళ్లిన చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఎదురవుతుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి ఎదురుదాడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు.