జాతీయ స్థాయిలో చక్రం తిప్పేది జగనే…. కెసీఆర్ కాదు..!

తెలంగాణలో 16 స్థానాల్లో గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు పదేపదే చెబుతున్న చెబుతున్నారు. కారు.. సారు.. 16 నినాదంతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు కాసింత ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలోని 16 లోక్ సభ నియోజక వర్గాలలో పది స్థానాలకు మించి టిఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మల్కాజ్ గరి, సికింద్రాబాద్, మెదక్, నల్గొండ, భువనగిరి లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటున్నారు. పది స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ చక్రం తిప్పడం సాధ్యం కాకపోవచ్చు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ ఊపందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 22 నియోజక వర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ రెండు మూడు స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితులు నెలకొంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేది జగన్….. కేసీఆర్ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్తున్న కేసీఆర్ కేవలం పది స్థానాల్లో గెలిస్తే జాతీయ స్థాయిలో ఆయన మాట ఎవరు వింటారని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో జగన్ కీలకం కానున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 22 స్థానాలు గెలుచుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపేందుకు ఏ మమతాబెనర్జీ అయినా… మాయావతి అయినా ముందుకు వస్తారని, పది స్థానాలు గెలుచుకున్న కెసిఆర్ తో పని చేసేందుకు వారు ముందుకు రారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.