వరుణ్ పాత్రలో…. అర్జున్ కపూర్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి మొట్టమొదటిసారిగా ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తెలుగు వర్షన్ లో నటించిన ముఖ్య నటీనటులని హిందీ రీమేక్ లో కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. కానీ తెలుగులో వరుణ్ తేజ్ పోషించిన పాత్రలో ఇప్పుడు బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.

తెలుగు వెర్షన్ లో ముఖ్య నటీనటులందరూ హిందీ వర్షన్ లో కూడా నటించనుండగా కేవలం వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమాలో కనిపించడు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా గా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరి కొన్ని వారాల్లో ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.