ఆనపకాయ… ఆరోగ్యమయ్యా…

దీనిని సొరకాయ అని కూడా పిలుస్తారు. పొట్టిగా… గుండ్రంగా ఉండే దానిని ఆనపకాయ అని, సన్నగా… పొడుగ్గా ఉంటే సొరకాయ అని పిలుస్తారు. ఇందులో ఆనపకాయ ఆంధ్రప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇక సొరకాయను తెలంగాణలో విరివిగా పండిస్తారు. ఈ రెండూ కూడా ఒకే రకమైన గుణాలను కలిగి ఉంటాయి.

 • దీనిలో 90 శాతం నీరు ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది.
 • ఇందులో అధిక శాతంలో ఫైబర్… బిపీ, షుగర్ లను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్ ను బ్యాలెన్స్ డ్ గా ఉంచుతుంది.
 • అనపకాయలో విటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్ లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 • మలబద్దకంతో బాధపడే వారు సొరకాయ జ్యూస్ లేదా ఆహారంలో ఏదో రూపంలో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
 • శరీరంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను అదుపు చేస్తుంది.
 • కడుపులో ఎటువంటి ఇన్ ఫెక్షన్ నైనా సరే సొరకాయ జ్యూస్ మూడు రోజులు తాగితే వెంటనే తగ్గిపోతుంది.
 • చర్మం పొడి బారకుండా నిగనిగలాడాలంటే….. అనేక చర్మ సమస్యలకు ఆనపకాయ దివ్యౌషధం.
 • శరీరంలో ఉన్న సోడియం లెవల్స్ ను బ్యాలెన్స్ డ్ గా ఉంచేందుకు దోహదపడుతుంది.
 • వేసవి కాలంలో సొరకాయ జ్యూస్ వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
 • మూత్ర సంబంధ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న వారు సొరకాయ జ్యూస్ లో నిమ్మరసం కలుపుకుని తాగితే ఆ బాధనుంచి బయటపడతారు.
 • చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడుతుంటే అలాంటి వారు సొరకాయ జ్యూస్ తాగితే తగ్గిపోతుంది.
 • నిద్రలేమితో బాధపడుతున్న వారు రాత్రి ఆనపకాయను ఆహారంలో తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
 • మూత్రపిండాలను శుద్ది చేయడంలో ఆనపకాయకు పెట్టింది పేరు. ఇందులోని ఖనిజాలు మూత్ర పిండాలకు ఎంతో మేలు చేస్తాయి.