కారు ప్రమాదంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ దుర్మరణం

  • కారు ప్రమాదంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ దుర్మరణం
  • కుమారుడితో సహా మృతి చెందిన మహిళా క్రికెటర్

సౌతాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్ ఎల్ రీసా…స్టిల్ ఫోంటీన్ నగరంలో జరిగిన కారుప్రమాదంలో….తన కుమారుడితో సహా మృతి చెందారు.

సౌతాఫ్రికాజాతీయజట్టులో సభ్యురాలిగా నాలుగు మ్యాచ్ లు ఆడిన రికార్డు ఎల్ రీసాకు ఉంది. మూడు వన్డేలు, ఓ టీ-20 మ్యాచ్ ఆడిన 25 ఏళ్ల ఎల్ రీసా …వివాహం తర్వాత ఓ మగబిడ్డకు జన్మినిచ్చింది.

జాతీయజట్టులో చోటు లేకున్నా… అట్టడుగు వర్గాల బాలలకు క్రికెట్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా సామాజిక సేవ చేస్తోంది.

ఎల్ రిసా, ఆమె కుమారుడి మృతి పట్ల క్రికెట్ సౌతాఫ్రికా సంతాపం వ్యక్తం చేసింది.