Telugu Global
NEWS

హాకీ ఇండియా నయాకోచ్ గ్రాహం రీడ్

టోక్యో ఒలింపిక్స్ వరకూ భారతహాకీజట్టు కు శిక్షణ ప్రపంచ హాకీ ఆరో ర్యాంకర్ భారత్ కు…నాలుగు మాసాల విరామం తర్వాత….పూర్తిస్థాయి హాకీ కోచ్ దొరికాడు. ఆస్ట్రేలియా మాజీ శిక్షకుడు గ్రాహం రీడ్ ను ప్రధాన శిక్షకుడిగా నియమించినట్లు… హాకీ ఇండియా ప్రకటించింది. భారత కోచ్ పదవి నుంచి హరేంద్రసింగ్ జనవరిలోనే తప్పుకోడంతో…ప్రధాన శిక్షకుడు లేకుండానే భారత్ నెట్టుకొంటూ వచ్చింది. ఇటీవలే ముగిసిన అజ్లాన్ షా గోల్డ్ కప్ హాకీలో సైతం… కోచ్ లేకుండానే భారత్ అద్భుతంగా రాణించడం ద్వారా సత్తా […]

హాకీ ఇండియా నయాకోచ్ గ్రాహం రీడ్
X
  • టోక్యో ఒలింపిక్స్ వరకూ భారతహాకీజట్టు కు శిక్షణ

ప్రపంచ హాకీ ఆరో ర్యాంకర్ భారత్ కు…నాలుగు మాసాల విరామం తర్వాత….పూర్తిస్థాయి హాకీ కోచ్ దొరికాడు. ఆస్ట్రేలియా మాజీ శిక్షకుడు గ్రాహం రీడ్ ను ప్రధాన శిక్షకుడిగా నియమించినట్లు… హాకీ ఇండియా ప్రకటించింది.

భారత కోచ్ పదవి నుంచి హరేంద్రసింగ్ జనవరిలోనే తప్పుకోడంతో…ప్రధాన శిక్షకుడు లేకుండానే భారత్ నెట్టుకొంటూ వచ్చింది. ఇటీవలే ముగిసిన అజ్లాన్ షా గోల్డ్ కప్ హాకీలో సైతం… కోచ్ లేకుండానే భారత్ అద్భుతంగా రాణించడం ద్వారా సత్తా చాటుకొంది.

1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్న రీడ్….కంగారు జట్టుకు చీఫ్ కోచ్ గా సైతం వ్యవహరించారు. విజయవంతమైన శిక్షకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు.

1984, 1985, 1989, 1990 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు గ్రాహం రీడ్ కోచ్ గా వ్యవహరించారు. అంతేకాదు..130 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అరుదైన రికార్డు సైతం గ్రాహం రీడ్ సొంతం.

బెంగళూరు కేంద్రంగా భారత హాకీజట్టు శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి తాను సిద్ధమని రీడ్ ప్రకటించారు. మైకేల్ నాబ్స్ తర్వాత భారత హాకీజట్టుకు కోచ్ గా వ్యవహరించిన.. కంగారూ శిక్షకుడు గ్రాహం రీడ్ మాత్రమే.

First Published:  8 April 2019 11:08 AM GMT
Next Story