Telugu Global
NEWS

ప్రత్యేక హోదాకే కాదు.... పోలవరానికి కూడా మా మద్దతు ఇస్తాం

తెలంగాణపై చంద్రబాబు తన అక్కసును వెళ్లగక్కుతున్నారని…. మేం పోలవరానికి వ్యతిరేకమని, ప్రత్యేక హోదాను మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. కానీ మేం వాటికి మద్దతు ఇస్తున్నామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని జగన్ ప్రకటిస్తే…. నీ చెవులో చెప్పాడా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. […]

ప్రత్యేక హోదాకే కాదు.... పోలవరానికి కూడా మా మద్దతు ఇస్తాం
X

తెలంగాణపై చంద్రబాబు తన అక్కసును వెళ్లగక్కుతున్నారని…. మేం పోలవరానికి వ్యతిరేకమని, ప్రత్యేక హోదాను మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. కానీ మేం వాటికి మద్దతు ఇస్తున్నామని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని జగన్ ప్రకటిస్తే…. నీ చెవులో చెప్పాడా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. నేను ఇవాళ చెబుతున్నాను చంద్రబాబూ.. ఏపీ ప్రజల క్షేమం కోసం ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా తన ప్రచారంలో నన్నే కాకుండా హైదరాబాద్‌కు కూడా శాపనార్థాలు పెడుతున్నారు. ఇలా చేయడానికి కారణం అక్కడ ఆయన కహానీ కతమ్ అయ్యిందని కేసీఆర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ క్షేమమే కాదు… పక్క సోదర రాష్ట్ర బాగు కోసం కూడా పాటుపడుతుందని అన్నారు. చంద్రబాబూ నీలా గోతులు తవ్వి మాటలు మార్చే రకం కాదు… మా తెలంగాణ ఎంపీలతో పాటు రాబోయే రోజుల్లో జగన్ కూడా భారీగా ఎంపీలను గెలుచుకోబోతున్నారు. మేం అందరం కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

పోలవరం మీద మేం ఎన్నో కేసులు వేశామని అబద్దాలు చెబుతున్నారు. పోలవరం కట్టడానికి మేం ఏనాడూ అడ్డుకోలేదు. మాకు గోదావరి నుంచి రావాల్సిన 1000 టీఎంసీలను మేం తప్పక తీసుకుంటాం. తెలంగాణను ముంచొద్దు అన్నాం కాని.. పోలవరం కట్టొద్దు అనలేదు. ఆంధ్రా ప్రజలతో మాకు పంచాయితీ లేదు.. కాని నీలాంటి పిడికెడు మంది కిరికిరి గాళ్లతో మాత్రమే గొడవని కేసీఆర్ అన్నారు.

రాబోయే రోజుల్లో జగన్ ఏపీలో అధికారంలోకి రాబోతున్నారని…. తప్పక వారికి మా సహకారం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. చంద్రబాబు ఇక ఇంటికి పోవుడే అని ఆయన స్పష్టం చేశారు.

First Published:  8 April 2019 11:25 AM GMT
Next Story