Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కోసం త్యాగం చేసిన శర్వా

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్ లుగా నటించిన ప్రేమ కథా చిత్రం ’96’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వా ఈ సినిమా పైనే తాన ఆశలన్నీ పెట్టుకున్నాడు. తమిళ వెర్షన్ కు […]

ప్రభాస్ కోసం త్యాగం చేసిన శర్వా
X

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్ లుగా నటించిన ప్రేమ కథా చిత్రం ’96’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వా ఈ సినిమా పైనే తాన ఆశలన్నీ పెట్టుకున్నాడు. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు.

ముందుగా ఈ చిత్రానికి ’96’ అనే టైటిల్ ని పెడదామనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమాలో హీరోయిన్ పేరు మీద ‘జాను’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

అయితే ఇప్పుడు ఆ టైటిల్ కూడా వీరు వదులుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ప్రభాస్. ‘సాహో’ సినిమా తరువాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రెండు టైటిల్స్ ఒకేలా ఉండటం వలన శర్వా, దిల్ రాజు కలిసి కొత్త టైటిల్ వెతికే పనిలో పడ్డారట. ’96’ తెలుగు రీమేక్ టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

First Published:  8 April 2019 4:04 AM GMT
Next Story