Telugu Global
NEWS

ఈ సర్వే కూడా సొంత సర్వేనే....

తెలంగాణలో వ్యూహాం ఫలించలేదు. కానీ ఏపీలో మళ్లీ అదేగేమ్ ఎల్లో మీడియా మొదలు పెట్టింది. లగడపాటి పేరుతో తెలంగాణలో సర్వే పాచిక విసిరింది. ఇక్కడ బొక్కాబోర్లాపడింది. ఇప్పుడు ఏపీలో సర్వేల పేరుతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ పైట్ ఉందని….ఒకటి, రెండు శాతంతో 30కి పైగా నియోజకవర్గాలలో గెలుపోటములు మారే అవకాశం ఉందని ఈ చానళ్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీకి చాలా అనుకూలంగా ఉండే సదరు చానల్ ప్రసారం చేసిన […]

ఈ సర్వే కూడా సొంత సర్వేనే....
X

తెలంగాణలో వ్యూహాం ఫలించలేదు. కానీ ఏపీలో మళ్లీ అదేగేమ్ ఎల్లో మీడియా మొదలు పెట్టింది. లగడపాటి పేరుతో తెలంగాణలో సర్వే పాచిక విసిరింది. ఇక్కడ బొక్కాబోర్లాపడింది.

ఇప్పుడు ఏపీలో సర్వేల పేరుతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ పైట్ ఉందని….ఒకటి, రెండు శాతంతో 30కి పైగా నియోజకవర్గాలలో గెలుపోటములు మారే అవకాశం ఉందని ఈ చానళ్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

టీడీపీకి చాలా అనుకూలంగా ఉండే సదరు చానల్ ప్రసారం చేసిన సర్వేలో చాలా విడ్డూరాలు బయటపడ్డాయి. కార్పొరేట్ చాణక్య పేరుతో ఈ సారి లీక్ వదిలింది. ఈ సర్వేలో టీడీపీకి 101 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పుకుంది. అయితే ఇదే చానల్ లోక్ నీతి- సీఎస్డీఎస్ పేరుతో ఇంతకుముందు ఓ సర్వేను వదిలారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆ ప్రయత్నం చేయడంతో అభాసుపాలయ్యారు.

ఆ సర్వేలో టీడీపీకి 120కి పైగా స్థానాలు వస్తాయని చెప్పుకొచ్చారు. కానీ ఆరు రోజులు తిరిగేసరికి టీడీపీకి 20 సీట్లు తగ్గించేశారు. అంటే వారం రోజుల్లోనే టీడీపీ గ్రాఫ్ పడిపోయందని ఇదే చానల్ ఒప్పుకున్నట్లు కాదా? తాము ప్రసారం చేసిన రెండు సర్వేల్లోనే ఇంత తేడా ఉంటే…. ఇక గ్రౌండ్ లెవల్లో ఇక ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.

అయితే తాము సర్వేలు చేయలేదని ఇంతకుముందు స్వయంగా లోక్ నీతి ప్రకటన చేసింది. ఇప్పుడు టుడేస్ చాణక్య కూడా తాము ఏపీలో సర్వేలు చేయలేదని తెలిపింది.

దీంతో ఈ పచ్చ బ్యాచ్ కార్పొరేట్ చాణక్య అంటూ కొత్త పేరును ఎన్నుకున్నారు. ఈ కార్పొరేట్ చాణక్య ఫౌండర్ పేరు గోనుగుంట్ల అనిల్ కుమార్ చౌదరి. ఈయన తెలుగుదేశం పార్టీ వినుకొండ అభ్యర్థి జి.వెంకట అంజనేయులుకు బంధువు అని తెలుస్తోంది. ఆ పరిచయాలతోనే ఈ సర్వేలీకులు…. లైవ్ ల కార్యక్రమాన్ని రూపొందిచినట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు మూడు రోజుల సమయం ఉంది. 72 గంటల్లో పచ్చ మీడియా బ్యాచ్ మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని వైసీపీ శ్రేణులను ఆ పార్టీ అధినేత జగన్ మరోసారి కోరారు.

First Published:  8 April 2019 3:43 AM GMT
Next Story