Telugu Global
Cinema & Entertainment

'2.O' వర్సెస్ 'కె.జి.ఎఫ్'.... గెలుపెవరిది?

ఒకవైపు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటించిన ‘2.O’ సినిమా…. మరొకవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసిన ‘కే.జి.ఎఫ్’ సినిమా. ఈ రెండింటి మధ్య ఇప్పుడు పెద్ద పోరు జరగనుంది. బ్లాక్ బస్టర్ అయిన ‘రోబో’ సినిమాకి సీక్వెల్గా ‘2.0’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఒక మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది. మరొకవైపు యాక్షన్ […]

2.O వర్సెస్ కె.జి.ఎఫ్.... గెలుపెవరిది?
X

ఒకవైపు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటించిన ‘2.O’ సినిమా…. మరొకవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసిన ‘కే.జి.ఎఫ్’ సినిమా. ఈ రెండింటి మధ్య ఇప్పుడు పెద్ద పోరు జరగనుంది.

బ్లాక్ బస్టర్ అయిన ‘రోబో’ సినిమాకి సీక్వెల్గా ‘2.0’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఒక మోస్తరు కలెక్షన్స్ రాబట్టింది.

మరొకవైపు యాక్షన్ డ్రామా గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కే జి ఎఫ్: చాప్టర్ 1’ కూడా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇంతకీ ఈ రెండిటి మధ్య పోరు ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా ఈ రెండు సినిమాలు టీవీలో రాబోతున్నాయి. ఒకటి తమిళ్ ఒరిజినల్ సినిమా ‘2.O’, మరొకటి డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్’. ఈ రెండు చిత్రాలు ఆదివారం రోజున బుల్లితెరపై రాబోతున్నాయి.

మరి ఈ రెండు సినిమాల్లో ఏ చిత్రం ఎక్కువ టిఆర్పీ లను అందుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇమేజ్ పరంగా చూస్తే తమిళ తంబీలు ‘2.0’ సినిమాకు ఓటెయ్యాలి. కానీ మరొకవైపు ‘కేజీఎఫ్’ సినిమా తమిళంలో కూడా సూపర్ హిట్ అయింది. మరి ఈ రెండు సినిమాలలో ఏ చిత్రానికి ఎక్కువ టీఆర్పీ వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

First Published:  8 April 2019 11:07 PM GMT
Next Story