Telugu Global
NEWS

డబ్బుల పంపిణీలో దొంగనోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోంది. కోట్ల రూపాయిలు దొరుకుతున్నా, మరోపక్క ఓట్ల కొనుగోళ్లు ఆగడం లేదు. ప్రలోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతలు కొన్ని చోట్ల పంచుతున్న నోట్లలో దొంగనోట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలోనూ గుంటూరు జిల్లా ప్రాంతంలో ప్రభుత్వం పంపిణీ చేసే డబ్బులో దొంగనోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్నికలకు పంచే డబ్బులోనూ దొంగనోట్లను కలిపి ఇచ్చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. నర్సీపట్నం, అరకు, పాడేరు, రాజోలు, జగ్గంపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో చాలా […]

డబ్బుల పంపిణీలో దొంగనోట్లు
X

రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోంది. కోట్ల రూపాయిలు దొరుకుతున్నా, మరోపక్క ఓట్ల కొనుగోళ్లు ఆగడం లేదు. ప్రలోభాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతలు కొన్ని చోట్ల పంచుతున్న నోట్లలో దొంగనోట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలోనూ గుంటూరు జిల్లా ప్రాంతంలో ప్రభుత్వం పంపిణీ చేసే డబ్బులో దొంగనోట్లు బయటపడ్డాయి.

ఇప్పుడు ఎన్నికలకు పంచే డబ్బులోనూ దొంగనోట్లను కలిపి ఇచ్చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. నర్సీపట్నం, అరకు, పాడేరు, రాజోలు, జగ్గంపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ దొంగనోట్ల పంపకాలు జరిగాయి. ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకూ ఇచ్చే చోట్ల ఎక్కువగా నకిలీ నోట్లు పంచుతున్నట్టు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో, విశాఖ జిల్లాలో, అనంతపురం లోనూ ఎక్కువగా దొంగనోట్ల పంపకాలు జరుగుతున్నాయి.

అనుమానం కలగకుండా ఉండేదుకు అసలు నోట్లు నకిలీనోట్లు కలిపి ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందలేదని చెబుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా అధికార టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చాలా చోట్ల అవి నకిలీ నోట్లు అని తెలియక ప్రజలు వాటిని తీసుకుంటున్నారు. అనుమానించి అడిగిన వారికి నాయకులు సర్ది చెబుతున్నారు. పొరపాటున వచ్చాయి తర్వాత మార్చి ఇస్తాము… ఓటు మాత్రం వేయండని నమ్మబలుకుతున్నారు.

మీడియాకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎవరైనా అంటే, ఓటుకు డబ్బులు తీసుకుంటే ఇచ్చిన వారినీ, పుచ్చుకున్నవారినీ కూడా జైల్లోపెడతారని బెదిరిస్తున్నారు. దాదాపుగా 8 జిల్లాల్లో దొంగనోట్ల పంపిణీ భారీగా జరుగుతోందని తెలుస్తోంది.

పోలీసులకు ఈ విషయం తెలిసినా ప్రభుత్వ వత్తిడితో చూసీ చూడనట్టు ఉంటున్నారని, అసలు పోలీసులే కొన్ని చోట్ల దగ్గరుండి పంపకాలు చేయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దొంగ హామీలేకాదు ఓట్లు కొనేందుకు వాడుతున్న నోట్లూ దొంగవే అన్నమాట.

First Published:  9 April 2019 6:15 AM GMT
Next Story