Telugu Global
NEWS

ఐపీఎల్ -12లో కోల్ కతా బాహుబలి

వీరబాదుడులో యాండ్రీ రసెల్ టాప్ గేర్ 77 బాల్స్ లోనే 207 పరుగులు 22 సిక్సర్లు, 12 బౌండ్రీలతో 268. 63 స్ట్రయిక్ రేట్ నాలుగు మ్యాచ్ ల్లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచె పోటీలలో… మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ సూపర్ ఆల్ రౌండర్ యాండ్రీ రసెల్… వీరబాదుడులో తనను మించిన మొనగాడు లేడని చాటుకొన్నాడు. ప్రస్తుత సీజన్ మొదటి నాలుగు […]

ఐపీఎల్ -12లో కోల్ కతా బాహుబలి
X
  • వీరబాదుడులో యాండ్రీ రసెల్ టాప్ గేర్
  • 77 బాల్స్ లోనే 207 పరుగులు
  • 22 సిక్సర్లు, 12 బౌండ్రీలతో 268. 63 స్ట్రయిక్ రేట్
  • నాలుగు మ్యాచ్ ల్లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ తొలి అంచె పోటీలలో… మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ సూపర్ ఆల్ రౌండర్ యాండ్రీ రసెల్… వీరబాదుడులో తనను మించిన మొనగాడు లేడని చాటుకొన్నాడు.

ప్రస్తుత సీజన్ మొదటి నాలుగు మ్యాచ్ ల్లోనే… రసెల్ మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకొన్నాడు. ఒకటి కాదు… రెండుకాదు.. .తనజట్టుకు మూడుసార్లు ఒంటిచేత్తో విజయాలు అందించి…కరీబియన్ డైనమైటా…మజాకానా అనిపించుకొన్నాడు.

నాలుగు ఇన్నింగ్స్ లో…కేవలం 77 బాల్స్ మాత్రమే ఎదుర్కొని…22 సిక్సర్లు, 12 బౌండ్రీలు బాదాడు. మొత్తం 207 పరుగులతో 297.56 స్ట్రయిక్ రేట్ సాధించి.. బాప్ రే బాప్ అనిపించాడు.

బెంగళూరు బౌలర్ల బ్యాంగ్ బ్యాంగ్…

బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో ముగిసిన మ్యాచ్ లో… రసెల్ విశ్వరూపమే ప్రదర్శించాడు. తనజట్టు విజయానికి ఆఖరి నాలుగు ఓవర్లలో 66 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ కు దిగిన రసెల్ కేవలం 13 బాల్స్ లోనే 48 పరుగులు సాధించి … ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. బెంగళూరు పై 7 సిక్సర్లు, ఓ బౌండ్రీతో నాటౌట్ గా నిలిచాడు.

ప్రస్తుత సీజన్ మొదటి నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లో కోల్ కతా నైట్ రైడర్స్ సాధించిన మూడు విజయాలలో రసెల్ ప్రధానపాత్ర వహించాడు. గ్రౌండ్ ఎంత పెద్దదైనా తనకు లెక్కలేదని… సిక్సర్లు బాదే సత్తా తనకు ఉందని రసెల్ ధీమాగా చెబుతున్నాడు.

రానున్న మ్యాచ్ ల్లో రసెల్ మరెంతగా రెచ్చిపోతాడోనని అభిమానులు ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

First Published:  9 April 2019 9:13 AM GMT
Next Story