Telugu Global
NEWS

ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం

మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అధికారుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న కోయ ప్రవీణ్‌ను తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కోయ ప్రవీణ్‌పై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని లిఖిత పూర్వక పిర్యాదు ఇవ్వడంతో ఈసీ ఈ నిర్ణయం […]

ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం
X

మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అధికారుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న కోయ ప్రవీణ్‌ను తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కోయ ప్రవీణ్‌పై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని లిఖిత పూర్వక పిర్యాదు ఇవ్వడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పోలింగ్‌కు ఒక రోజు ముందు జిల్లా ఎస్పీని బదిలీ చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  9 April 2019 10:18 AM GMT
Next Story