Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్ సినిమా లో మహానటి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ‘సైరా’ షూటింగ్ పూర్తయ్యాక ఒక నెల బ్రేక్ తీసుకొని ఆ తర్వాత కొరటాల శివ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిరు. సోషల్ డ్రామాగా ఈనెల జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం […]

మెగాస్టార్ సినిమా లో మహానటి
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

‘సైరా’ షూటింగ్ పూర్తయ్యాక ఒక నెల బ్రేక్ తీసుకొని ఆ తర్వాత కొరటాల శివ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిరు. సోషల్ డ్రామాగా ఈనెల జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం స్క్రిప్టును ఈ మధ్యనే పూర్తి చేశాడు కొరటాల శివ.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఇప్పటికే చాలా పుకార్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుష్క, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ‘మహానటి’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమె ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి.

అంతేకాక శృతి హాసన్ ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది అని టాలీవుడ్ వర్గాలు గుసాగుసలాడుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదల కానుంది.

First Published:  8 April 2019 9:30 PM GMT
Next Story