కూతురి ఘనతకు పొంగిపోతున్న కేటీఆర్

గత తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించిన కేటీఆర్.. ప్రస్తుతం మంత్రివర్గంలో లేకపోయినా కీలకమైన లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు.

ఎడతెరిపి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రోజూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. అయితే ఇవాళ తన కూతురికి సంబంధించిన ఒక పోస్ట్ ట్విట్టర్‌లో పెట్టారు. అది వైరల్‌గా మారింది. ఇంతకు ఆ పోస్ట్ ఏంటంటే..

కేటీఆర్ కూతురు అలేఖ్య తన 5వ తరగతి అయిపోవడంతో స్కూల్ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంది. ఆ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. నిన్న మొన్ననే నువ్వు పుట్టినట్లు ఉంది తల్లీ.. కాని ఇవాళ ఐదో తరగతి పూర్తి చేసుకొని పెద్దదానివైపోయావు. నా ఎన్నికల బిజీ షెడ్యూల్‌కి విరామం ఇచ్చి.. నీ కోసమే వచ్చాను. అంటూ పోస్ట్ చేశారు. అందులో అలేఖ్య ఫొటోలు కూడా ఉంచారు.