Telugu Global
NEWS

మూడు లైన్ల వార్త... కోటి నష్టం... ముగ్గురు ఉద్యోగులు ఔట్‌

వార్తలు ప్రచురించాల్సిన సంస్థలు ఏపీలో ఎన్నికల పుణ్యమా అని వాటికవే వార్తల్లోకెక్కుతున్నాయి. నిన్న ఒక పత్రికలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ…. రోజూ ప్రచురిస్తునట్టే ప్రజల అభిప్రాయాలను ప్రచురిస్తున్న సమయాన ఈ సంచలనం చోటు చేసుకుంది. వైజాగ్‌లో ఓ వ్యక్తిని చంద్రబాబుపై అభిప్రాయం చెప్పమని అడిగాడు ఒక చిన్న విలేకరి…. దానికి అతను…. చంద్రబాబు మళ్ళీ గెలిస్తే కేంద్ర రాజకీయాలకు వెళతారనీ, ఇక్కడ లోకేష్‌ బాబును కీలకం చేస్తారని అంటూ… తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంపిందే […]

మూడు లైన్ల వార్త... కోటి నష్టం... ముగ్గురు ఉద్యోగులు ఔట్‌
X

వార్తలు ప్రచురించాల్సిన సంస్థలు ఏపీలో ఎన్నికల పుణ్యమా అని వాటికవే వార్తల్లోకెక్కుతున్నాయి.

నిన్న ఒక పత్రికలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ…. రోజూ ప్రచురిస్తునట్టే ప్రజల అభిప్రాయాలను ప్రచురిస్తున్న సమయాన ఈ సంచలనం చోటు చేసుకుంది.

వైజాగ్‌లో ఓ వ్యక్తిని చంద్రబాబుపై అభిప్రాయం చెప్పమని అడిగాడు ఒక చిన్న విలేకరి…. దానికి అతను….

చంద్రబాబు మళ్ళీ గెలిస్తే కేంద్ర రాజకీయాలకు వెళతారనీ, ఇక్కడ లోకేష్‌ బాబును కీలకం చేస్తారని అంటూ… తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంపిందే లోకేష్‌ బాబు…. కాబట్టి ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడలేడన్నాడు.

అంతేకాదు జగన్‌ అప్పుడు కాంగ్రెస్‌ పై ఇప్పుడు అనేక మందిపై పోరాడుతున్నాడు. కాబట్టి జగన్‌ వస్తేనే మేలని అభిప్రాయ పడ్డాడు.

పాపం ఆ విలేకరికి రాజకీయాలు తెలుసుకానీ ఈ లోపాయికారీ రాజకీయాలు తెలియక ఈ మూడు లైన్లు ఇలాగే పంపించడం…. సెంట్రల్‌ డెస్క్‌ ఉద్యోగి ఆ వాక్యాలను గమనించకుండా…. ఎడిట్‌ చేయకుండా…. వాటిని అలాగే పత్రికలో పెట్టేయడంతో….. అచ్చయి పోయింది. ఎక్కువ సర్య్కూలేషన్‌ ఉండే పత్రిక గనుక పెద్ద మొత్తంలో కాపీలు అచ్చయ్యాయి.

తరువాత ఎప్పుడో, ఎవరో ఎడిటోరియల్‌ సిబ్బంది అది గమనించి…. ఆ వార్తను పై వాళ్ళ దృష్టికి తీసుకువచ్చాడు. దాంతో హడావిడిగా ముద్రణ ఆపి…. మళ్ళీ ఆ వాక్యాలను మార్చి ముద్రించడంతో సంస్థకు కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చిందట.

ఎంత నష్టం అయినా పర్వాలేదు గానీ లోకేష్‌కు వ్యతిరేకంగా మనదాంట్లో వార్తలు రాకూడదని, అచ్చయిన కాపీలను చెత్తలో వేసి మళ్ళీ ప్రింట్‌ చేశారట.

ఆ వార్త పంపిన విలేకరిని, పెట్టిన సబ్‌ ఎడిటర్‌ని, చెక్‌ చేసిన ఇంచార్జ్‌ని…. సంస్థకు ఇక మీ సేవలు అక్కర్లేదని చెప్పారని సమాచారం.

First Published:  9 April 2019 5:58 AM GMT
Next Story