Telugu Global
Cinema & Entertainment

విజయ్ తో మజిలీ దర్శకుడు?

నాని హీరోగా నటించిన ‘నిన్ను కోరి’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ మధ్యనే ‘మజిలీ’ తో మరొక హిట్ నమోదు చేసుకున్నాడు. నాగచైతన్య, సమంత కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల అయి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక శివ నిర్వాణ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ తదుపరి సినిమాలో […]

విజయ్ తో మజిలీ దర్శకుడు?
X

నాని హీరోగా నటించిన ‘నిన్ను కోరి’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ మధ్యనే ‘మజిలీ’ తో మరొక హిట్ నమోదు చేసుకున్నాడు.

నాగచైతన్య, సమంత కలిసి నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల అయి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక శివ నిర్వాణ తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ తదుపరి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం తన కుటుంబానికి సమయం కేటాయించిన దర్శకుడు శివ నిర్వాణ త్వరలో ఒక కథను ప్రిపేర్ చేసి దానిని విజయ్ దేవరకొండ కి వినిపించనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ‘మజిలీ’ సినిమాను నిర్మించిన సాహో గారపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.

కాకపోతే విజయ్ దేవరకొండ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పూర్తయ్యాకే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటిదాకా ఎమోషనల్ కథలను రాసిన శివ నిర్వాణ విజయ్ దేవరకొండ కోసం ఎలాంటి కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  9 April 2019 12:14 AM GMT
Next Story