Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వర్మ క్యాంపు కి వచ్చేసిన హీరోయిన్ ?

ఇప్పటిదాకా దర్శకుడిగా ప్రేక్షకులను అలరించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా నటుడిగా మారబోతున్న సంగతి తెలిసిందే. ‘కోబ్రా’ అనే సినిమాతో రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాను వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఒక ప్రమాదకరమైన క్రిమినల్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ గోపాల్ వర్మ ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో […]

మళ్లీ వర్మ క్యాంపు కి వచ్చేసిన హీరోయిన్ ?
X

ఇప్పటిదాకా దర్శకుడిగా ప్రేక్షకులను అలరించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏకంగా నటుడిగా మారబోతున్న సంగతి తెలిసిందే.

‘కోబ్రా’ అనే సినిమాతో రామ్ గోపాల్ వర్మ నటుడిగా మారబోతున్నాడు. ఈ సినిమాను వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఒక ప్రమాదకరమైన క్రిమినల్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో రామ్ గోపాల్ వర్మ ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇరా మోర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ నిర్మించిన ‘భైరవ గీత’ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇరా. అప్పటినుంచి వర్మతో ఈమెకు పరిచయం ఉంది.

ఈ సినిమా విడుదలకు ముందు వరకు వర్మ ఆమెను ఆకాశానికి ఎత్తుతూ బోలెడు సార్లు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఆమెకు ఒక్క మంచి ఆఫర్ కూడా లభించలేదు.

తాజాగా ఇప్పుడు మళ్ళీ రాంగోపాల్ వర్మ సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఈ సినిమా ఇరా మోర్ కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే.

First Published:  9 April 2019 11:13 PM GMT
Next Story