Telugu Global
Cinema & Entertainment

5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన మజిలీ

నాగచైతన్య సినిమాలు అయితే అటు ఫ్లాప్ అవుతాయి, లేదంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 10 రోజులు టైమ్ తీసుకుంటాయి. కానీ ఈ హీరో కెరీర్ లోనే ఫస్ట్ టైం వారం లోపే బ్రేక్ ఈవెన్ అయింది మజిలీ సినిమా. అవును.. నాగచైతన్య-సమంత జంటగా నటించిన ఈ సినిమా నిన్నటి వసూళ్లతో కలుపుకొని, కేవలం 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా లాభాల బాట పట్టిందన్నమాట. విడుదలైన ఈ 5 రోజుల్లో ఈ […]

5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన మజిలీ
X

నాగచైతన్య సినిమాలు అయితే అటు ఫ్లాప్ అవుతాయి, లేదంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 10 రోజులు టైమ్ తీసుకుంటాయి. కానీ ఈ హీరో కెరీర్ లోనే ఫస్ట్ టైం వారం లోపే బ్రేక్ ఈవెన్ అయింది మజిలీ సినిమా. అవును.. నాగచైతన్య-సమంత జంటగా నటించిన ఈ సినిమా నిన్నటి వసూళ్లతో కలుపుకొని, కేవలం 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా లాభాల బాట పట్టిందన్నమాట.

విడుదలైన ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దీంతో బయ్యర్లంతా సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇక ఇవాళ్టి నుంచి వచ్చేదంతా లాభం కిందే లెక్క. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీ. విడుదలైన ఈ 5 రోజుల్లో మజిలీ సినిమా వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 6.84 కోట్లు
సీడెడ్ – రూ. 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.59 కోట్లు
ఈస్ట్ – రూ. 1.08 కోట్లు
వెస్ట్ – రూ. 0.81 కోట్లు
గుంటూరు – రూ. 1.44 కోట్లు
కృష్ణా – రూ. 1.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.47 కోట్లు

First Published:  10 April 2019 11:01 AM GMT
Next Story