Telugu Global
NEWS

విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డు ల్లో విరాట్ కొహ్లీ హ్యాట్రిక్

2016, 2017, 2018 సీజన్లలో విరాట్ షో 2018 సీజన్లో  2వేల 735 పరుగుల కొహ్లీ మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ 11 సెంచరీలతో 68. 37 సగటు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘విజ్డెన్‌’ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించాడు. గత ఏడాది కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలో అసాధారణంగా రాణించడం ద్వారా కోహ్లీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు విస్ డన్ ప్రకటించింది. మహిళల విభాగంలో భారత ఓపెనర్ స్మృతి మంధానా, […]

విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డు ల్లో విరాట్ కొహ్లీ హ్యాట్రిక్
X
  • 2016, 2017, 2018 సీజన్లలో విరాట్ షో
  • 2018 సీజన్లో 2వేల 735 పరుగుల కొహ్లీ
  • మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టిన టీమిండియా కెప్టెన్
  • 11 సెంచరీలతో 68. 37 సగటు

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘విజ్డెన్‌’ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించాడు. గత ఏడాది కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలో అసాధారణంగా రాణించడం ద్వారా కోహ్లీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు విస్ డన్ ప్రకటించింది.

మహిళల విభాగంలో భారత ఓపెనర్ స్మృతి మంధానా, టీ-20 క్రికెట్లో అప్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం విజ్డెన్ అవార్డులకు ఎంపికయ్యారు.

కొహ్లీతో పాటు…ఈ అవార్డుకు ఎంపికైన ఇతర క్రికెటర్లలో ఇంగ్లండ్ కు చెందిన జోస్ బట్లర్, సామ్ కరెన్, రోరీ బర్న్స్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ టామీ బ్యూమోంట్ ఉన్నారు.

విరాట్ హ్యాట్రిక్…

భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి విఖ్యాత క్రికెట్‌ మ్యాగజైన్‌ ‘విజ్డెన్‌’ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016, 2017, 2018 సీజన్లలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా…కొహ్లీ అరుదైన ఈ గౌరవం సాధించాడు.

2014 ఇంగ్లండ్ టూర్ లో కేవలం 59 పరుగులు మాత్రమే సాధించిన కొహ్లీ…2018 ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం 593 పరుగులు సాధించడం ద్వారా మూడోసారి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ గా ఎంపికయ్యాడు.

మూడుఫార్మాట్లలోనూ జోరు…

సాంప్రదాయ టెస్ట్ , ఇన్ స్టంట్ వన్డే, ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లలో కొహ్లీ నిలకడగా రాణించాడు. మొత్తం 2వేల 735 పరుగులు సాధించాడు. ఇందులో 11 శతకాలతో పాటు 68. 37 సగటు సైతం ఉంది.

2016 సీజన్లోనూ….

2016 సీజన్లో కోహ్లి టెస్టుల్లో 75.93 సగటుతో 1,215 పరుగులు, పది వన్డేల్లో 92.37 సగటుతో 739 పరుగులు, టి20ల్లో 106.83 సగటుతో 641 పరుగులు చేసి అసాధారణ ఫామ్ లో నిలిచాడు.

గతంలోనే … విజ్డెన్‌ మ్యాగజైన్‌ విరాట్‌ కోహ్లి కవర్‌పేజీతో విడుదలైంది. 2003 సంవత్సరంలో విజ్డెన్‌ లీడింగ్‌ క్రికెటర్‌ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తొలిసారి అవార్డు దక్కించుకున్నాడు. ఇంతకు ముందే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో సచిన్ టెండుల్కర్,వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. వారి సరసన నిలిచిన మూడో భారత క్రికెటర్ గా కొహ్లీ రికార్డుల్లో చేరాడు.

వీరూ డబుల్ ధమాకా…

భారత మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ కు ఈఅవార్డు 2008, 2009 సంవత్సరాల్లో ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ కు 2010 లో విజ్డెన్ అవార్డు లభించింది. సచిన్‌కు వారసుడు విరాట్‌ కోహ్లి అంటూ విజ్డెన్‌ ఎడిటర్‌ లారెన్స్‌ పొగడ్తల్లో ముంచెత్తారు.

First Published:  10 April 2019 10:36 AM GMT
Next Story