Telugu Global
Cinema & Entertainment

మోహన్ బాబు పై కేసు విషయమై నోరువిప్పిన వై.వి.యస్.చౌదరి

దర్శకుడు వైవిఎస్ చౌదరి మరియు మోహన్ బాబు మధ్య గొడవ రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మోహన్ బాబు తాను అరెస్ట్ కాలేదని ఇంట్లోనే ఉన్నాను అని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి కూడా రియాక్ట్ అయ్యారు. “2009లో నేను సలీం సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు నాకు రెమ్యూనరేషన్ కింద నాకు 40,50,000 ఇవ్వాల్సి ఉంది. కానీ […]

మోహన్ బాబు పై కేసు విషయమై నోరువిప్పిన వై.వి.యస్.చౌదరి
X

దర్శకుడు వైవిఎస్ చౌదరి మరియు మోహన్ బాబు మధ్య గొడవ రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మోహన్ బాబు తాను అరెస్ట్ కాలేదని ఇంట్లోనే ఉన్నాను అని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి కూడా రియాక్ట్ అయ్యారు. “2009లో నేను సలీం సినిమాకు దర్శకత్వం వహించాను. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు నాకు రెమ్యూనరేషన్ కింద నాకు 40,50,000 ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత 23 స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల రెండవ తారీకున నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది” అని స్టేట్మెంట్ ద్వారా తెలియజేశారు చౌదరి.

అంతేకాక “ఈ నేపథ్యంలో మోహన్ బాబు…. నేను న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినట్టుగా పేర్కొనడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరోవైపు మోహన్ బాబు జల్పల్లి గ్రామం లో నివసిస్తున్న ఇంటిని ఆనుకుని ఉన్న స్థలాన్ని నేను ‘సలీం’ సినిమా నిర్మాణ సమయంలోనే కొన్నాను. చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పు తర్వాత నన్ను నా మనుషుల్ని నా స్థలంలోకి రానివ్వకుండా వారు అడ్డుకోవటం నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోంది.

స్థలం విషయంలో మరియు జరుగుతున్న వ్యవహారాల పై పరిష్కారం కోసం నేను న్యాయనిపుణులను ఆశ్రయించాను. మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్ నోటీసులు కూడా ఈ లేఖ తో జత చేశాను” అని తన ఆవేదన వ్యక్తం చేశారు వైవీఎస్. మోహన్ బాబు ఇంకా ఈ విషయమై రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

First Published:  9 April 2019 8:46 PM GMT
Next Story