Telugu Global
NEWS

నారా అసహన బాబు...!

ఆయనకి కోపం తారస్థాయికి చేరుతోంది. ఆయన అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఇన్నాళ్లు ఎదుటివారిలో కోపాన్ని, అసహనాన్ని మాత్రమే చూసిన ఆయన ఇప్పుడు తనలోని కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా… ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన… రాజకీయాలలో అనేక ఆటుపోట్లను చూశాను. జయాపజయాలు నాకు కొత్త కాదు అని చెబుతుంటాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మాత్రం ఆయనలోని అసహనాన్ని […]

నారా అసహన బాబు...!
X

ఆయనకి కోపం తారస్థాయికి చేరుతోంది. ఆయన అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఇన్నాళ్లు ఎదుటివారిలో కోపాన్ని, అసహనాన్ని మాత్రమే చూసిన ఆయన ఇప్పుడు తనలోని కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటున్నారు.

ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా… ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన… రాజకీయాలలో అనేక ఆటుపోట్లను చూశాను. జయాపజయాలు నాకు కొత్త కాదు అని చెబుతుంటాడు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మాత్రం ఆయనలోని అసహనాన్ని రెట్టింపు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన వారే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, చివరకు ఎన్నికల కమిషన్ పై కూడా చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేస్తున్నారంటున్నారు.

మానవ సంబంధాల కంటే రాజకీయాలకే ఎక్కువ విలువ ఇచ్చే చంద్రబాబునాయుడు గడచిన వారం రోజులుగా తీవ్ర అసహనంతో ఉన్నారు అని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ ఎన్నికలలో పరాజయం పాలవుతారనే భయమే ఆయనను వెంటాడుతోందని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు మనసులో ఎంత కోపం, అసహనం, వ్యతిరేకత ఉన్నా దాన్ని బయటకు కనిపించనీయని నైజం ఆయనది. అలాంటిది ఈ ఎన్నికలలో మాత్రం చంద్రబాబు నాయుడు చీటికి మాటికీ చిరాకు వ్యక్తం చేస్తున్నారని, ప్రతి అంశంపైన అసహనం వ్యక్తం చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఈసారి ఎన్నికలలో పరాజయం తప్పదనే భయం చంద్రబాబు నాయుడిని నీడలా వెంటాడుతుందని వారంటున్నారు.

గతంలో ఎన్నడూ లేనట్లుగా జోడించి “శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నన్ను గెలిపించండి” అంటూ ప్రాధేయపడే స్థాయికి చంద్రబాబు నాయుడు వచ్చారని, ఇది ఆయనలో అసహనానికి ప్రతీక అని అంటున్నారు. గడచిన పది రోజులుగా నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లోనూ, ఇతర సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  10 April 2019 10:05 PM GMT
Next Story