Telugu Global
NEWS

ఈవీఎంను పగులగొట్టిన జనసేన అభ్యర్థి

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చిన జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 183కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముధుసూదన్ గుప్తా వచ్చారు. అయితే ఓటింగ్ ఛాంబర్లలో శాసన సభ, పార్లమెంటు అనే పేర్లు సరిగా […]

ఈవీఎంను పగులగొట్టిన జనసేన అభ్యర్థి
X

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌కు వచ్చిన జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు.

గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్ 183కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముధుసూదన్ గుప్తా వచ్చారు. అయితే ఓటింగ్ ఛాంబర్లలో శాసన సభ, పార్లమెంటు అనే పేర్లు సరిగా రాయలేదంటూ పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న అధికారులు ఆయనకు ఎంత సర్థి చెప్పినా వినకుండా ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టడంతో అది పగిలిపోయింది.

ఈవీఎం పగిలిపోవడంతో అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అధికారులు వెంటనే స్టాండ్‌బైలో ఉన్న యంత్రాన్ని అమర్చి పరిశీలిస్తున్నారు. మరోవైపు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అదుపులోనికి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

First Published:  10 April 2019 9:44 PM GMT
Next Story