ఆ చెత్తతో నాకు పోలికేంటి?

కొన్ని రోజులుగా నటి అలియా భట్ పై విమర్శలు గుప్పిస్తున్న కంగనా రనౌత్.. ఆ వ్యవహారాన్ని అలానే కొనసాగిస్తోంది. నెపోటిజం కోణంలో అలియాపై విమర్శలు చేసిన కంగనా.. ఇప్పుడు అవార్డుల విషయంలో ఆమెపై విరుచుకుపడుతోంది. నటనపరంగా ఆమెతో తనకు అస్సలు పోటీ లేదని అంటోంది.

బాలీవుడ్ లో అవార్డుల సీజన్ మొదలైంది. దీంతో సినిమాల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. ఇందులో భాగంగా కంగనా నటించిన మణికర్నిక, అలియా చేసిన గల్లీబాయ్ సినిమాలు పోటీపడుతున్నాయి. దీనికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు కంగనా సీరియస్ గా స్పందించింది.

“అలియా భట్ పాత్రలో గొప్పేముంది. గల్లీబాయ్ లో ఆమె పాత్ర నాకు నచ్చలేదు. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. దయచేసి ఇలాంటి చెత్తతో నా సినిమాను, నటనను పోల్చకండి.”

ఇలా ఓపెన్ గానే అలియాభట్ పై విరుచుకుపడింది కంగనారనౌత్. నిజానికి బాలీవుడ్ లో వీళ్లిద్దరూ మంచి నటులే. కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా.. నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. మంచి నటీమణులుగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

అలియాపై వ్యక్తిగతంగా, నెపోటిజం కోణంలో ఎన్ని విమర్శలు చేసినా ఓకే కానీ ఆమె నటనను కించపరచడం మాత్రం తప్పంటున్నారు చాలామంది నెటిజన్లు. ఈ విషయంలో సోషల్ మీడియాలో కంగానాను సపోర్ట్ చేసేవాళ్లు తగ్గిపోయారు.