Telugu Global
Cinema & Entertainment

ఆగిపోయిన రవితేజ సినిమా

వరుసగా ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలతో 3 డిజాస్టర్లు చవిచూసిన రవితేజ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయి అనే విషయం లోనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తమిళ హీరో విజయ్ నటించిన ‘తెరి’ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ‘పోలీసోడు’ అనే టైటిల్ తో డబ్బింగ్ చేశారు… కానీ కాలెక్షన్లపరంగా పర్వాలేదనిపించిన ఈ సినిమాని రవితేజ రీమేక్ చేయాలని […]

ఆగిపోయిన రవితేజ సినిమా
X

వరుసగా ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలతో 3 డిజాస్టర్లు చవిచూసిన రవితేజ చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయి అనే విషయం లోనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తమిళ హీరో విజయ్ నటించిన ‘తెరి’ సినిమా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ‘పోలీసోడు’ అనే టైటిల్ తో డబ్బింగ్ చేశారు… కానీ కాలెక్షన్లపరంగా పర్వాలేదనిపించిన ఈ సినిమాని రవితేజ రీమేక్ చేయాలని అనుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘తేరీ’ తెలుగు రీమేక్ తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించాలి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని చిత్ర నిర్మాణ వ్యవహారాలు చేపట్టారు. కానీ కొద్ది రోజులు షూటింగ్ జరిపిన తరువాత ఈ సినిమాను సడన్ గా ఆపేశారు.

మొదట సినిమా బాగానే ఉంది అనుకున్నప్పటికీ తర్వాత మాత్రం రీమేక్ చేసినా సినిమా ఆడుతుంది అన్న నమ్మకం లేక పోవడంతో నిర్మాతలతో మాట్లాడి రవితేజ సినిమా ఆపేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం రవితేజ ‘డిస్కో రాజా’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఆర్.టీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  10 April 2019 9:25 PM GMT
Next Story