Telugu Global
NEWS

2014లో మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి.... ఓడిపోబోతుంటే చెడ్డవా?

చంద్రబాబు మాటలు ప్రెస్‌ మీట్‌ కు వచ్చిన విలేకరులకే అర్ధం కాలేదు అని, చంద్రబాబు వ్యర్దమైన మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని  వైసీపీ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల సరళి చూస్తే ప్రజలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దుర్మార్గపాలన చేసిన చంద్రబాబును ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు భావించారు. […]

2014లో మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి.... ఓడిపోబోతుంటే చెడ్డవా?
X

చంద్రబాబు మాటలు ప్రెస్‌ మీట్‌ కు వచ్చిన విలేకరులకే అర్ధం కాలేదు అని, చంద్రబాబు వ్యర్దమైన మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని వైసీపీ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విజయవాడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఎన్నికల సరళి చూస్తే ప్రజలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుంది. దుర్మార్గపాలన చేసిన చంద్రబాబును ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. దుష్టపరిపాలన అంతం చేయాలని ప్రజలు భావించారు. అందుకే రాత్రి 9 గంటలు దాటినా క్యూలలో నిలుచుని ఓట్లు వేశారు.

చంద్రబాబు మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గతంలో కంటే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారంటే 23 తర్వాత అని చంద్రబాబు చెప్పారు. మంచిరోజు చూసుకోమనండి ప్రమాణస్వీకారం చేస్తారో మరేం చేస్తారో ప్రజలు చూస్తారు.

అధికారులను చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. సాక్షాత్తు ఈసి అధికారినే చంద్రబాబు బెదిరించారు. చంద్రబాబు అధికారులను దూషిస్తున్నారు. ఐపిఎస్‌, ఐఏఎస్‌ అధికారులను కొనేశారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న అధికారులలో కొందరిని మారిస్తే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు.

అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఓటమి భయంతో చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారు. గత కొన్నిరోజులుగా చంద్రబాబు మాటలు పరిశీలిస్తే ఆయన అధికారం కోల్పోబోతున్నారని అర్దం అవుతుంది. చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తున్నారని అర్దమవువుతుంది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. నిజంగా చంద్రబాబు గెలుస్తారనే భావిస్తే అంత కంగారు ఎందుకు పడుతున్నారు.

ఈవిఎంలు మొరాయించాయని చంద్రబాబు మాట్లాడటం ఏంటో అర్దం కావడం లేదు. ఈవిఎంలు పనిచేయకపోతే పోలింగ్‌ శాతం ఎలా పెరిగింది. పోలింగ్‌ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. ఈసీని, అధికారులను, ఈవిఎంలను చంద్రబాబు తప్పుపడుతున్నారు. 2014 ఎన్నికలలో ఇదే ఈవిఎంల వల్ల గెలిచిన విషయం వాస్తవం కాదా? ఈ ఎన్నికలలో మాత్రం అవే ఈవిఎంలు పనికిరాలేదా.

కోడెల శివప్రసాద్‌ పై మా పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదు. కోడెల ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్‌ స్టేషన్‌ లోకి వెళ్లి తలుపులు ఎందుకు వేసుకున్నారు. కోడెల అక్కడ కుట్రపూరితంగా వ్యవహరించారు కాబట్టి ఆ గ్రామ ప్రజలు తిరగబడ్డారు. బూత్‌ ఆక్రమణ,రిగ్గింగ్‌ వంటి అంశాలకు మేం దూరం. కోడెల పై ఉన్న కేసులు చూస్తే ఎవరు ఇలాంటి అంశాలకు గతంలో పాల్పడ్డారో తెలుస్తుంది. టిడిపినేతలు దాడులు చేసి ఆ దాడులు మాపై నెడుతున్నారు. అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు.

మే 23 వ తేదీన అందరి జాతకాలు బయటపడతాయి. వచ్చే మే 23 వ తేదీన చంద్రబాబు నిజమైన శక్తి బట్టబయలు కాబోతోంది అని అన్నారు రాంబాబు.

First Published:  12 April 2019 6:25 AM GMT
Next Story