Telugu Global
NEWS

ఎటువైపో చెప్పేసారు... తీర్పే తరువాయి...!

ఎర్రటి ఎండ. పట్టించుకోలేదు. చాంతాడంత లైన్లు. వెనక్కి తగ్గలేదు. కొన్ని పార్టీల బెదిరింపులు. భయపడలేదు. మహిళలు, వృద్ధులు  బారులు తీరి వారంతా ఎటువైపు ఉన్నారో చెప్పేశారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు నుంచే ఊర్లలో జనాలు ఓటు హక్కు  వినియోగించుకోవడం కోసం కదిలారు. 175 శాసనసభ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజ కవర్గాలకు జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము ఎటువైపు ఉన్నారో నిక్కచ్చిగా చెప్పేశారు. వారి కోరికలు,  ఆకాంక్షలు, వ్యతిరేకతలు, కోపాలు అన్నింటిని ఒక […]

ఎటువైపో చెప్పేసారు... తీర్పే తరువాయి...!
X

ఎర్రటి ఎండ. పట్టించుకోలేదు. చాంతాడంత లైన్లు. వెనక్కి తగ్గలేదు. కొన్ని పార్టీల బెదిరింపులు. భయపడలేదు. మహిళలు, వృద్ధులు బారులు తీరి వారంతా ఎటువైపు ఉన్నారో చెప్పేశారు. పోలింగ్ ప్రారంభానికి గంట ముందు నుంచే ఊర్లలో జనాలు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కదిలారు.

175 శాసనసభ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజ కవర్గాలకు జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము ఎటువైపు ఉన్నారో నిక్కచ్చిగా చెప్పేశారు. వారి కోరికలు, ఆకాంక్షలు, వ్యతిరేకతలు, కోపాలు అన్నింటిని ఒక ఓటు రూపంలో నిక్షిప్తం చేసి 42 రోజుల పాటు రాజకీయ నాయకులకు పరీక్ష పెట్టారు.

గతంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం ఉందని అధికారులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఉంటేనే ఈ స్థాయిలో పోలింగ్ పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.

పోలింగ్ శాతాన్ని చూసిన అధికార తెలుగుదేశం పార్టీ ఈవీఎంలు పని చేయడం లేదంటూ సరికొత్త ఆరోపణలు తెరమీదకు తీసుకు వచ్చింది. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తోంది అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

ఎన్నికలు ప్రారంభమైన అరగంటకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయ పార్టీలకు చెందిన వారు, రాజకీయ విశ్లేషకులకే కాదు… సామాన్యులలో కూడా చర్చనీయాంశం అయింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఎవరూ మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేదు. ఇది ఆ పార్టీ మానసిక స్థితిని తెలియజేస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ధర్మం గెలుస్తుందని, దైవం ధర్మానికి అనుకూలంగా తీర్పు చెబుతుందని తాము విశ్వసిస్తున్నట్లు గా ప్రకటించారు. ఇక ఓటరు దేవుడు ఇచ్చిన తీర్పు తెలియాలంటే అన్ని పార్టీల వారు మే 23 కోసం వేచి చూడాల్సిందే.

First Published:  11 April 2019 10:56 PM GMT
Next Story