Telugu Global
NEWS

ఫలితాలపై వాళ్ళ కన్నా.... వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు

తాము గెలుస్తామో..? లేదో..? అని పోటీ చేసిన అభ్యర్థులకు భయం వెంటాడుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేశాను కదా విజయం వరిస్తుందా..? అని వారిని కొన్ని సందేహాలు వెంటాడతాయి. ఇది పెద్ద పెద్ద రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు చిన్న రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి కూడా ఉండే భయం. తమకు డిపాజిట్ రాదని, తాము గెలిచే అవకాశాలు కనుచూపు మేరలో లేవని తెలిసినా స్వతంత్ర అభ్యర్థులకు కూడా విజయంపై […]

ఫలితాలపై వాళ్ళ కన్నా.... వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు
X

తాము గెలుస్తామో..? లేదో..? అని పోటీ చేసిన అభ్యర్థులకు భయం వెంటాడుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేశాను కదా విజయం వరిస్తుందా..? అని వారిని కొన్ని సందేహాలు వెంటాడతాయి.

ఇది పెద్ద పెద్ద రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు చిన్న రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి కూడా ఉండే భయం. తమకు డిపాజిట్ రాదని, తాము గెలిచే అవకాశాలు కనుచూపు మేరలో లేవని తెలిసినా స్వతంత్ర అభ్యర్థులకు కూడా విజయంపై ఒకింత ఆశ ఉంటుంది.

అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అభ్యర్ధులకు బదులు భయపడటం, కలవరపడడం, ఆందోళన చెందడం పచ్చ మీడియా వంతయ్యింది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి పోలింగ్ ప్రారంభం అయినంత వరకు అధికార తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న పచ్చ మీడియాను ఓటింగ్ సరళి ఆందోళన కలిగించింది అంటున్నారు.

గడచిన నెల రోజులుగా అధికార తెలుగుదేశం పార్టీ కోసం మీడియాలో ఊహాతీతమైన కథనాలను ప్రచురిస్తూ ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా చేసిన పచ్చ మీడియా ఓటింగ్ సరళి అనంతరం విజయంపై నమ్మకాలు పోగొట్టుకుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగిన తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించిన పచ్చ మీడియా అధిపతులకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వాస్తవాలు మింగుడు పడడం లేదని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటింగ్ లో పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని అంటున్నారు.

ఈ ఓటింగ్ శాతం అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జరిగిందని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండటం వల్లే ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిర్ణయాన్ని తెలియజేశారని పచ్చ మీడియా అంచనా వేస్తోందని చెబుతున్నారు.

ఈ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల కంటే ఫలితాల కోసం నిరీక్షించే పచ్చ మీడియా అధిపతులకు టెన్షన్ ఎక్కువైందని చెబుతున్నారు.

First Published:  11 April 2019 11:36 PM GMT
Next Story