ఎన్నికల సమయం బోయపాటికి బాగానే కలిసొచ్చింది

ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ పార్టీ ప్రచారాలు గురించిన ప్రకటనలతో హోరెత్తిస్తుంటారు రాజకీయ నాయకులు. అది ప్రజలకు కొంత చిరాకు తెప్పించినప్పటికీ సెలబ్రిటీలకు మాత్రం డబ్బులు పోగేసుకునే సమయం ఇది.

ప్రమోషన్ ప్రకటనల్లో నటించడం కోసం, వాటిని చిత్రీకరించడం కోసం వారికి పెద్ద మొత్తాల్లో డబ్బులు అందుతాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను కూడా బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ (టిడిపి) కి మద్దతుగా దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని యాడ్స్ చిత్రీకరించారు.ఆ ప్రకటనలకు భారీగానే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను ఏకంగా 4.5 కోట్ల ను రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం డబ్బు పరంగా మాత్రమే కాక ఈ మధ్యనే ‘వినయ విధేయ రామా’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను కి మరొక ఆఫర్ కూడా లభించింది.

టిడిపి లీడర్ నందమూరి బాలకృష్ణ బోయపాటి తో ఒక సినిమా తీసేందుకు ఒప్పుకున్నారన్న సంగతి తెలిసిందే. ఎన్నికల హడావిడి పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్నికల పుణ్యమా అని బోయపాటి శ్రీను మంచి అవకాశాలనే పొందాడు.