మెగా హీరోలందరికీ స్పెషల్ షో…?

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ వెనుక ఒక్కొక్కరుగా మెగా హీరోలు అందరూ చేరిన సంగతి తెలిసిందే. డైరెక్టుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఎన్నికల సమయం కాబట్టి దాదాపు అందరు మెగా హీరోలు జనసేన ప్రమోషన్ క్యాంపెయిన్ లలో బాగానే పాల్గొన్నారు.

నాగబాబు కూడా జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగుతుండడం వలన వరుణ్ తేజ్ కూడా ఈ క్యాంపెయిన్ లలో భాగమయ్యాడు. అంతేకాక బాబాయ్ ని సపోర్ట్ చేస్తూ రామ్ చరణ్ కూడా పవన్ కు మద్దతు పలికారు. అల్లు అర్జున్ కూడా పవన్ కు సపోర్టుగా కాంపెయిన్ లలో పాల్గొన్నారు. చిరంజీవి దగ్గర నుండి నిహారిక వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో మెగా హీరోలు అందరూ రిలాక్స్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం తేజ్ మెగా హీరోలందరినీ ఈ సినిమా స్క్రీనింగ్ కి ఆహ్వానించాడట. మెగా కుటుంబం మొత్తానికి తేజు ఈ సినిమాను స్పెషల్ గా చూపిస్తున్నాడట. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కచ్చితంగా హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.