Telugu Global
Health & Life Style

ఉల్లే కాదు.... వెల్లుల్లీ ఎంతో మేలు

వెల్లుల్లి ఆహారానికి రుచిని తీసుకు వస్తుంది. వెల్లుల్లి అందానికి మెరుగులు తెస్తుంది… వెల్లుల్లి యాంటిబయోటిక్ లాగా పని చేస్తుంది…. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది…. వెల్లుల్లి ఆయువు పెంచుతుంది…  చూసారా వెల్లుల్లి వల్ల ఎన్ని లాభాలో. చాలా మంది వెల్లుల్లి వెగటు వాసన వస్తుందని తినడానికి ఇష్టపడరు. ఉల్లి లాగే వెల్లుల్లి కూడా తల్లిలా మేలు చేస్తుంది. వెల్లుల్లి వల్ల ఉపయోగాలు…. ప్రయోజనాలు తెలుసుకుందాం… వెల్లుల్లిలో కాల్షియం, ఐయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి అనేక […]

ఉల్లే కాదు.... వెల్లుల్లీ ఎంతో మేలు
X

వెల్లుల్లి ఆహారానికి రుచిని తీసుకు వస్తుంది. వెల్లుల్లి అందానికి మెరుగులు తెస్తుంది… వెల్లుల్లి యాంటిబయోటిక్ లాగా పని చేస్తుంది…. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది…. వెల్లుల్లి ఆయువు పెంచుతుంది… చూసారా వెల్లుల్లి వల్ల ఎన్ని లాభాలో. చాలా మంది వెల్లుల్లి వెగటు వాసన వస్తుందని తినడానికి ఇష్టపడరు. ఉల్లి లాగే వెల్లుల్లి కూడా తల్లిలా మేలు చేస్తుంది. వెల్లుల్లి వల్ల ఉపయోగాలు…. ప్రయోజనాలు తెలుసుకుందాం…

  • వెల్లుల్లిలో కాల్షియం, ఐయోడిన్, ఐరన్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
  • శరీరంలో ఉన్న అధిక కొవ్వు, రక్తపోటు, గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలను వెల్లుల్లి నివారిస్తుంది.
  • ఆయుర్వేద మందులలో వెల్లుల్లిని ప్రధానంగా వాడుతారు.
  • రోజూ పరగడుపునే ఒకటి లేక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే లివర్ సమస్యలు, క్యాన్సర్, కీళ్లవాతం వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
  • అంతేకాదు కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియా, ఇతర హానికర వ్యర్దాలు, క్రిములు నశించేలా చేస్తుంది.
  • వెల్లుల్లిని పసుపుతో నూరి ఆ ముద్దను శరీరానికి మర్దన చేస్తే పక్షవాతంతో పాటు ఇతర వాతాలు కూడా తగ్గుతాయి.
  • వెల్లుల్లి రసం వేడినీళ్లతో కలిపి తాగితే ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు వెంటనే తగ్గు ముఖం పడతాయి.
  • వెల్లుల్లి పాయను మెత్తగా నూరి ఆ ముద్దను తేలు, పాము, ఇతర విష జంతువులు కుట్టిన చోట పట్టు వేస్తే ఆ విషం హరించుకుపోతుంది.
  • ఒక గ్లాసు పాలు….. ఒక గ్లాసు నీరు కలిపి అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఆ మిశ్రమం పావు గ్లాసు అయ్యేదాక మరిగించి… ఈ మిశ్రమం తాగితే కొన్ని రోజులకు టీబీ నయం అవుతుంది.
  • వెల్లుల్లి పొట్టును కాల్చి ఆ బూడిదను ఆలీవ్ అయిల్ లో కలుపుకుని తలకు పట్టిస్తే జుత్తు వత్తుగా, నల్లగా పెరుగుతుంది.
  • నోటి దుర్వాసనతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఆ దుర్వాసన నుండి బయటపడతారు.
  • వెల్లుల్లిలో విటమిన్ సి, బి6, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు స్త్రీల రుతుక్రమాన్ని సరి చేయడమే కాదు ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • వెల్లుల్లి రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ… రక్తన్ని శుద్ది చేయడంలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • వెల్లుల్లి ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే సర్వాంగ వాతం (general paralysis), వగర్పు దగ్గు (bronchitis), ఉబ్బస దగ్గు (asthama), తుంటి నొప్పి (sciatica), ఆమ వాతము (Rheumatism) వంటి వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఏదైనా కూడా అతి అనర్దమే అంటారు కదా.. అలాగే వెల్లుల్లి మోతాదుకు మించి తింటే కూడా ప్రేగులు, కంటి చూపు, నల్లదబ్బ (spleen) కు హాని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • వెల్లుల్లి ఎక్కువగా తింటే వికారం, తలనొప్పి, బిపీ వంటి సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
First Published:  11 April 2019 10:55 PM GMT
Next Story