మజిలీ మొదటి వారం వసూళ్లు

విడుదలైన 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన మజిలీ సినిమా.. ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికీ వసూళ్లు తగ్గకపోవడం విశేషం. దీనికి 2 కారణాలు.

వాటిలో ఒకటి సమ్మర్ కాగా, రెండోది థియేటర్లలో సరైన సినిమా లేకపోవడం. కారణాలు ఏమైనా, నాగచైతన్య మాత్రం మజిలీ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులకు గాను ఈ సినిమాకు 21 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ రావడం విశేషం. ఇదే ఊపు కొనసాగితే.. నాగచైతన్య తన కెరీర్ లో మరో అరుదైన రికార్డు కూడా అందుకుంటాడు.

అదేంటంటే.. ప్రస్తుతం ఈ సినిమాకు నైజాంలో 9 కోట్ల పాతిక లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇది కనుక 10 కోట్ల మార్క్ టచ్ అయితే, చైతూ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అదొక రికార్డు అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 9.25 కోట్లు
సీడెడ్ – రూ. 3 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.08 కోట్లు
ఈస్ట్ – రూ. 1.25 కోట్లు
వెస్ట్ – రూ. 0.97 కోట్లు
గుంటూరు – రూ. 1.63 కోట్లు
కృష్ణా – రూ. 1.46 కోట్లు
నెల్లూరు – రూ. 60 కోట్లు