ఇస్మార్ట్ శంకర్.. నభా నటేష్ లుక్ ఇదే

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్ ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు నభా నటేష్ వంతు. సినిమాలో ఆమె లుక్ ను కూడా ఈరోజు విడుదల చేశారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమాకు సంబంధించి సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో చిందేస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌ రాగా… ఇప్పుడు న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి.

ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఫోక్ స్టయిల్ లో సాగే పాట ఇది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వేసవిలోనే విడుదలకానుంది.