ఇక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తానంటున్న ప్రభాస్

సోషల్ మీడియా పుణ్యమా అని ఫాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు. కానీ ఇప్పటికీ కొందరు స్టార్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో లేని సంగతి తెలిసిందే. అందులో ఒకరు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టనున్నారు. అది ఎవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను ఏర్పరుచుకున్న ప్రభాస్… ఫ్యాన్స్ ఎక్కువగా డిమాండ్ చేయడం వలన ఎట్టకేలకు సోషల్ మీడియాలో అడుగుపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేయబోతున్నారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ప్రభాస్ ఆన్ ఇంస్టాగ్రామ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వార్తను సోషల్ మీడియాలో బీభత్సంగా షేర్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇంస్టాగ్రామ్ లో అడుగు పెడుతున్నాడు అనే వార్తే ఈ రేంజ్ లో వైరల్ అవుతుంటే ఇక ప్రభాస్ అడుగుపెట్టిన వెంటనే ఫాలోవర్ లిస్టు ఒక రేంజ్లో పెరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నారు.