ఉన్నది ఉన్నట్టు దింపేస్తున్న బెల్లంకొండ

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ ను కేవలం 30 లేదా 40 రోజుల్లో పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. అంతేకాక ఈ సినిమా మీడియం బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ ను ఇంత త్వరగా పూర్తి చేయడానికి వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందట.

అది ఏంటంటే చాలావరకు తమిళం లో ఉన్న అన్ని సీన్లు తెలుగులో కాపీ పేస్ట్ చేస్తున్నారని సమాచారం. అందుకే హీరో హీరోయిన్ ని తప్ప మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అందర్నీ కూడా తమిళంలో నటించిన వారిని తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంత భాగం తప్ప మిగతా సినిమా మొత్తం తమిళంలో ఉన్న సీన్స్ అన్నీ తెలుగులో కూడా రిపీట్ అవుతున్నాయట.

ఈ నేపథ్యంలో దర్శకత్వం చాలా ఈజీ అవుతుంది. అందుకే షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేసేయొచ్చు. ఇప్పటికే ఈ చిత్ర థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అన్ని కలిపి ఇరవై కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.