ఈ పోస్టర్ ను…. ఇలా ట్రోల్ చేస్తున్నారు

ఈ మధ్యనే ‘పేట’ సినిమాతో తమిళంలో హిట్ అందుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

‘దర్బార్’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ ఈ సినిమాలో రజనీకాంత్ కూతురు పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. కానీ రజనీ అభిమానులు సైతం ఈ పోస్టర్ పై మండిపడుతున్నారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు పోస్టర్ హాలీవుడ్ సినిమా ‘కిల్లర్ గంతర్’ సినిమా పోస్టర్ లా ఉందని కామెంట్ చేస్తూ దర్శకనిర్మాతలపైన మండిపడుతున్నారు.

హాలీవుడ్ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టారని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పోస్టర్ ను కూడా ఎందుకు కాపీ కొట్టడం అంటూ కొందరు దర్శక నిర్మాతలపై విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో పోస్టర్ మాత్రమేనా లేక సినిమా కథ కూడా కాపీ కొట్టారా? అంటూ అనుమానాలు రేకెత్తిస్తున్నారు.