చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్

ఎట్టకేలకు సాయి తేజ్ కు ఓ హిట్ పడింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ హీరో చేసిన చిత్రలహరి సినిమా పాజిటివ్ టాక్ తో ప్రారంభమైంది. తొలి రోజు ఈ సినిమాకు దాదాపు 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దీంతో అటు క్రిటిక్స్ పరంగా, ఇటు రెవెన్యూ పరంగా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

నిజానికి చిత్రలహరిలో సెకెండాఫ్ ఏమంత బాగాలేదు. కానీ ఓవరాల్ గా ఓసారి చూడొచ్చు, సినిమా ఓకే అనే టాక్ వచ్చింది. దీనికి తోడు మార్కెట్లో మజిలీ తప్ప మరో సినిమా లేదు. అందుకే చిత్రలహరి క్లిక్ అయింది. సాయి తేజ్ పంట పండింది.

ఇక మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 3 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు 3 కోట్లు వచ్చాయి. ఏపీ, నైజాంలో ఈ సినిమాను 11 కోట్ల రూపాయలకు అమ్మారు. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే మరో 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఏపీ, నైజాంలో చిత్రలహరి మొదటి రోజు షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 0.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.38 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.24 కోట్లు
నెల్లూరు – రూ. 0.14 కోట్లు