నాని కేవలం కొంతసేపే కనిపిస్తాడట!

ఈ మధ్యనే ‘దేవదాసు’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాని ఒక క్రికెటర్ పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా పూర్తయ్యాక నాని ఒక మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నాడు. నాని మరియు సుధీర్ బాబు కలిసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో నాని పాత్ర కేవలం 15 నుంచి 20 నిమిషాల వరకు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో మెయిన్ హీరో సుధీర్ బాబు అన్న మాట. నాని స్క్రీన్ టైమ్ తక్కువ ఉన్నప్పటికీ తన పాత్ర సినిమాలో కీలకం అవుతుందని, అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడని కొందరు అంటున్నారు.

అంతేకాక ‘అష్టాచమ్మా’ సినిమాతో నాని ని హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ కోసం ఈ సినిమా చేయబోతున్నట్లు కొందరు అంటున్నారు.